ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోంది. సభకు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభకు చేరుకొని భారత్ మాతాకై జై అంటూ జనసేన అధినేత తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  అరుణ్ జైట్లీని ఉద్దేశించి ఆంగ్లంలో మాట్లాడుతూ - నేను పవన్ కల్యాణ్, అమరావతి నుంచి మాట్లాడుతున్నానని, నాలుగేళ్ల నుంచి ఎపికి అన్యాయం చేస్తున్నరారని అన్నారు. మీ ప్రకటన మా గుండెలను మండేస్తుందని అన్నారు.


విభజనలో ఎపికి అన్యాయం జరిగిందని అన్నారు.చట్టాలు మాకే గానీ మీకు కాదా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనదిశగా నడిపించారని అన్నారు.  తర్వాత తెలుగులో మాట్లాడుతూ..తెలుగు భాషలందు తెలుగు లెస్సా అన్నారు.    ప్రజలను మోసంచేసి మభ్యపెట్టి వాళ్లు పబ్బం గడుపుకుంటూ ఉంటే మీరు వచ్చి మొరపెట్టుకుంటుంటే ఎంత బాధ, ఆవేశం ఉంటుందో మీకు తెలుసునని, అదే ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టానని అన్నారు.  ఓ వైపు తెలుగు రాష్ట్రాల నుంచి సభకు జనసేన కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు.


కార్యకర్తలను అదుపులోకి తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయిన పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. పోలీసుల వలయాలన్ని జనసేన కార్యకర్తలు చేధించి వస్తున్నారు.  పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..ఒక ఓటు రెండు రాష్ట్రాలని బిజెపి తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు, జగన్‌కు వాళ్ల భయాలు వారికి ఉండవచ్చు, కేంద్రమంటే తనకు భయం లేదని అన్నారు.

జనసేన అధినేత.. ఆ తప్పు మళ్ళీ చేస్తాడా?

ప్రత్యేక హోదా మన ఆత్మగౌరవం విషయమని, కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. సెంటిమెంటుతో ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అనడాన్ని ఆయన తప్పు పట్టారు. మందుపాతరలు పెట్టి రాజకీయ నాయకులు చంపేస్తారని, వెంటాడి చంపేస్తారని అన్నారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు నా తమ్ముళ్లను ఎందుకు త్యాగం చేయమంటాడని అన్నారు.


కంచె చేను మేస్తుందనే సామెత తనకు గుర్తు వస్తోందని అన్నారు. ఇది ఆర్గనైజేష్ కాదా, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పోరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాదా చూపిద్దామని అన్నారు.  ఫాతిమా కాలేజ్ విద్యార్థులు ఏం పాపం చేశారని..వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచారు...వారి జీవితాలతో ఆడుకున్నారు.


ఫాతిమా కాలేజ్ విద్యార్థుల పట్ల జరిగిన అన్యాయం చూస్తుంటే..తెలుగు దేశం పార్టీ పరిస్తితి ఏంటో తెలుస్తుందని అన్నారు. ఈ రోజు నుంచి మీ వైఫల్యాలను ఎండగడతాం..ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నందుకు మిమ్మల్ని రోజూ నిలదీస్తూనే ఉంటాం. ఎర్ర చందన స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని మరి దాని ఆదాయం ఎటు పోతుందని ప్రశ్నించారు..సత్యం మాట్లాడండి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: