ఇన్నాళ్లూ టీడీపీతో స్నేహం చేసిన జనసేన అధిపతి ఇప్పుడు  యూటర్న్ తీసుకున్నాడు.. మంగళగిరిలో నిర్వహించిన నాలుగో ఆవిర్భావ సభలో టీడీపీనే టార్గెట్ చేశాడు. వైసీపీని, కేంద్రాన్ని లైట్ గా తీసుకున్న పవన్.. తన స్పీచ్ అంతా చంద్రబాబు, లోకేశ్ లను ప్రశ్నించడంతోనే సరిపెట్టాడు. దీనిపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పవన్ స్కెచ్ ఏంటో అర్థం చేసుకున్న పసుపు దళాలు కౌంటర్ స్టార్ట్ చేశాయి. 


పవన్ యూటర్న్ తో అవాక్కయిన సీఎం చంద్రబాబు వెంటనే వ్యూహం  రచించేశారు. పవన్ ను జగన్ తో జతకలిపిన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ సాక్షి పత్రికలో వచ్చిన అంశాలనే ప్రస్తావించారంటూ జగన్ తో ముడిపెట్టేశారు. రాష్ట్రం ఇంతగా అట్టుడుకుతుంటే, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతుంటే పవన్  కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. 


మంగళగిరి సమావేశఁ నన్ను, లోకేష్‌ను, ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే పెట్టినట్టుగా ఉందన్న చంద్రబాబు.. ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకంలా అనిపిస్తోందన్నారు.  ఇంత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుంటే మాకు అండగా ఉండాల్సింది పోయి, మమ్మల్ని గురి పెట్టి మాట్లాడటం ఎవరి ప్రయోజనాల కోసమని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సభ ముగిసిన తర్వాత ఆయన ప్రసంగాన్ని సమీక్షించిన చంద్రబాబు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: