డబ్బు కోసం జనం కొత్త నేరాలు చూస్తున్నారు. అందుకు కొత్త కొత్త పద్దతులు వెదుకుతున్నారు. డబ్బు కోసం మొగుడికి పెద్ద ఎత్తున భీమా చేయించి ఆ తర్వాత అతడ్ని రోడ్డు ప్రమాదం రూపంలో హత్య చేయించి.. ఆ సొమ్ము కాజేసేందుకు ప్రయత్నించిన భార్య, బావమరిది దుర్మార్గం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాకు చెందిన కనుమర్లపూడి శ్రీనివాసులు హత్యను పోలీసులు చిక్కుముడి విప్పారు. 

Image result for fell under lorry

అసలేంజరిగిందంటే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లెకు చెందిన అరవీటి రమేష్‌ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో లూబ్రికెంట్‌ ఆయిల్స్‌ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్ద బావ శ్రీనివాసులు, చెల్లెలు రమాదేవి ఉండేవారు. భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని భార్య రమాదేవి అతడిని అంతమొందించేందుకు రమేశ్ సహాయం కోరింది. 

Image result for murder for insurance money

రమేష్ తన సోదరి రమాదేవితో చేయి కలిపి.. శ్రీనివాసులు చేత తెలివిగా బీమా చేయించారు. వాటిపై రుణాలు పొందారు. అంతే కాదు ఇంకా వేరు వేరు సంస్థల్లో మరో 2 కోట్ల మేర బీమా చేయించారు. ఆ తర్వాత రమాదేవి తన ప్రియుడు మధుసూదన్ రావును రంగంలోకి దింపింది. అందరూ కలిసి పథకం ప్రకారం శ్రీనివాసులును తీర్థయాత్ర పేరుతో కర్నూలు జిల్లా యాగంటికి తీసుకెళ్లారు.  

Image result for insurance money india
అక్కడ ఎదురుగా వస్తున్న ఓ లారీ కింద శ్రీనివాసులు తోసేశారు.. కొనఊపిరితో ఉండగా గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత  పోలీసుస్టేషన్‌కు వెళ్లి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయినట్లు కట్టుకథ చెప్పారు. బీమా సొమ్ము క్లెయించేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ హతుడి బంధువులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో రమాదేవి బండారం బయటపడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: