సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరు హృదయవిదారకం. రాష్ట్రాన్ని వధ్యశిలపై కాంగ్రెస్ సోనియాగాంధి ముందు నిర్ణయం తీసుకునే పెట్టింది. అంతకు  ముందు గానే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు విభజనకు అంగీకరిస్తూ షరతులు లేని లేఖ సమర్పించారు.

Image result for division of ap state

ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్ కు ముఖ్యం. అందుకే తెలంగాణా ఉద్యమనేత కలవకుంట్ల చంద్రశేఖర రావుతో సంధి చేసుకుని రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, రెండు ఖండాలుగా చట్టసభల ప్రతినిధుల ముందే నరికేసింది సోనియా.  అక్కడ సాక్ష్యంగా ఉంది, భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారత రాజకీయాల్లో తలపండిన, ముప్పవరపు వెంకయ్యనాయుడు.


వ్యాపార రాజకీయాలు, పదవీ రాజకీయాలు ప్రాధమ్యాలుగా ఉన్న ఆ రోజు యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాక, విభజనను ఎవరూ ఆపలేరని తెలిసి కూడా మూర్ఖంగా ఈ రాజకీయ నాయకుల మాటలు విశ్వసించి  "సమైక్యాంధ్ర ఉద్యమం" చేసి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. చివరకు రాజధాని లేని శిరస్సు కోల్పోయిన మొండె మే  నేటి అవశేష ఆంధ్రప్రదేశ్. 


అప్పుడే:


ప్రత్యేక హోదా,

రాజధానికి నిధులు,

ఉమ్మడి ఆస్తుల విభజన

పోలవరం ప్రోజెక్ట్

విభిన్న విద్యా వ్యవస్థలు

నౌకాశ్రయాలు,

ప్రత్యేక రైల్వే జోన్స

హజ వాయు టెర్మినల్స్


ఇలాంటివి విభజన చట్టంలో ఉండేలా చూసుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ కి కొంతైనా ప్రయోజనం సిద్ధించేది. అప్పుడు ఆవేశకావేశాలు వదిలేసి ఆచరణాత్మకంగా నిర్ణయం తీసుకోక పోవటమే పెద్ద పొరపాటు. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంట్ సభ్యులకు వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు వారికి ముఖ్యంగా ఉందేవి. అందుకే వాళ్ళు మొత్తం విషయాన్ని ప్రక్కదారి పట్టించారు.

Image result for special category status states in india

అస్సాం, నాగాలాండ్ మరియు జమ్ము & కాశ్మీర్ ఈ మూడు రాష్ట్రాలు తొలిసారి ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు.  అరుణాచల ప్రదేశ్, త్రిపుర, మెఘాలయ, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచలప్రదెశ్, సిక్కిం ఈ ఎనిమిది రాష్ట్రాలు తరవాత కాలములో ప్రత్యేక హోదా పొందాయి. మొత్తం కలిపి 11 రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యెక హోదా ఉనికిలో ఉంది. వీటిని పరిశీలిస్తే ఏ రకంగాను ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఆంధ్ర ప్రదెశ్ కు లభించే అవకాశం లేదని తెలుస్తుంది.  

Image result for assam nagaland j&K states in map

దాదాపుగా పైవేవీ విభజన చట్టం లో పొందుపరచలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా చట్టపరమైన హక్కుగా రూపుదిద్దుకునే విషయంలో కూడా మళ్ళీ అలాంటి పొరపాటే కొనసాగుతుంది. మోది-షా ద్వయం దృష్టి ఎప్పుడూ ఎన్నికల గెలుపుపైనే ఉంటుంది. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అంత ముఖ్యమనిపించవు. దానికి కారణం దాని మిత్రపక్షం తెలుగుదేశం ప్రవర్తనే కారణం.


ఎలా అంటే తెలుగుదేశం వాళ్ళు తొలుత "ప్రత్యేక హోదా" కుదరదు అన్న మరుక్షణం "బిజెపి-టిడిపి సంకీర్ణం" నుండి బయట పడక పోవటం. అదే పెద్ద నేఱం. అపార రాజకీయ అనుభవం సుధీర్ఘ రాజకీయ జీవితం తో తలపండి పోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు ప్రత్యేక పాకేజికి అంగీకరించారు? ఇదే ప్రధాన సమస్య.


అంతే కాదు "ప్రత్యేక హోదా సంజీవని కాదు!"  ప్రత్యేక హోదా అన్న ఎవరినైనా అరష్ట్ చేసేయ మని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రి, మళ్ళీ నీతి రీతి లేకుండా ప్రత్యేక హోదా వెంట పడటం ఏమంత న్యాయం?


పవన్ కళ్యాణ్ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానంటే బిజెపితో కలుస్తానని అంటే బిజెపి ఆలోచనలో పడుతుంది. బలమైన కాపు ఓట్లు, యువత ఓట్లు, విద్యావంతుల ఓట్లు వస్తాయి, మనం ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చుని బిజెపి ఆశపడుతుంది. అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు.


జగన్- బిజెపి కలయిక టిడిపి-బిజెపి అంత ప్రయోజనాన్ని ఇవ్వకపోవచ్చు. జగన్తో కలుస్తానని చెప్పినా బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు అనుకున్నా కానీ, ఇక్కడ వైకాపా- బిజెపి కలిస్తే ఆ కూటమి కి క్రిష్టియన్స్, ముస్లింలు కొన్నివెనుకబడ్దవరాలు దూరం అవుతారనే భయం ఉంది. కాబట్టి ఇది ప్రయోజనం కాదు.


ఇప్పుడు ఏపి ప్రజలకి కావాల్సింది ఎమోషన్స్ రెచ్చగొట్టే శివాజీ లాంటి సినిమాలు లేని హీరోలు, అధికారానికి అమ్ముడు పోయే అశోక్ బాబులు కాదు. నిజాలు నిర్భయంగా మాట్లాడి, ఓట్లకోసం, పదవుల కోసం కాకుండా ప్రజలకోసం ఆలోచించే నాయకులు. అలాంటి వారు ఉన్నారంటారా?


సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమంపై పెట్టిన శ్రద్ధ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తమ డిమాండ్ల సాధనకు వినియోగించి ఉనట్లైతే నేడు ఈ దుస్థితి రాష్ట్రానికి దాపురించేదే కాదు! నాడు రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి.


బాజపా ముప్పవరపు వెంకయ్యనాయుడు సాధించి పెట్టిన సమైఖ్య రాజధానిని వినియోగించుకొని ప్రపోర్ష్-నేట్ గా పన్ను ఆదాయాన్ని పంచుకుని ఉంటే క్రమంగా నూతన రాజధాని అమరావతిని ఒక దశాబ్ధకాలంలో ప్రజ అభిప్రాయం మేరకు నిర్మాణమై ఉండేది.


అయితే రాజధాని నిర్మాణానికి నగర నిర్మాణానికి నింగీ నేల అంత అంతరం ఉంది. రాజధానికైతే రాజ్యాంగ సంబంధమైన శాసనసభ, శాసనమండలి, సచివాలయం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, పోలీస్ హెడ్-క్వార్టెర్స్ ఇతర కార్యాలయాలు ఇంకా పాలన అవసరాలకు టగినట్లు అన్నీ భవన నిర్మాణాలు సదుపాయాలు ఒక చోట నిర్మించటం అవసరం. అమెరికా రాజధాని వాషింగ్టన్ కూడా దేశ పాలనా నగరమే తప్ప వాణిజ్య నగరం కాదు. అంతే కాదు హైదరాబాద్ ను మించిన నగరం నిర్మాణం కావాలణి అది జరగటానికి ఒక అర్ధ శతాబ్ధం పడుతుంది. ఈ చంద్రబాబు దురాశే ఆంధ్ర ప్రదేశ్ కొంప ముంచింది.  

Image result for assam nagaland j&K states in map

అసలు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చరిత్ర సమైఖ్య ఆంధ్రప్రదేశ్ చరిత్రంత. ఆ ఉద్యమం అంత ఊపందుకోవటానికి కారణం ఆంధ్రా ప్రాంత ఒకటి రెండు కుల వర్గాల వాసుల దురాశ. అంతే కాదు వారి సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేయటం ఆరేడు దశాబ్ధాలపాటు కొనసా గింది. అది తెలుగుదేశం హయాంలో ముఖంగా చంద్రబాబు నాయుడి పాలనా కాలం లో తార స్థాయికి చేరింది. రెండు మూడు కుల వర్గాలలో ఉన్నత రాజకీయ సినిమా పారిశ్రామిక వ్యక్తులు దాదాపు తెలంగాణాని దోచేయటమే తెలంగాణాలోని పేదరికానికి కారణం అనేది నిర్వివాదాంశం.


ఈ దోపిడీ వర్గానికి నాయకత్వం వహించిన వారే తెలంగాణాపై ఇంకా రాజకీయ పెత్తనం ప్రదర్శిం చటానికి ప్రజాప్రతినిధుల కొనగోళ్ళ వ్యూహం ప్రదర్శించగా అది ధారుణ పరాభవం తో బెడిసి కొట్టింది. ఇప్పుడు ఆ రాజకీయ దురాశ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవటం అక్కడ టోకున గంప గుత్తగా విపక్ష వైసిపి శాసనసభ్యులను కొనెయ్యటానికి ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు కేంద్రం ఇచ్చిన సొమ్మును తరలించినట్లు కొన్ని అధికార ఇంటెలిజెన్స్ పోలీస్ నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం.

Image result for division of ap state

మొత్తం "అధికార పార్టీ సభ్యులు గల్లీ టు డిల్లీ" టిడిపి నాయకత్వం అంతా అమరావతి ప్రాంతంలో భూకబ్జాలు తదితర ప్రజా దోపిడీ నిరాటంకంగా సాగించినట్లు అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇతర ప్రాంతాలవారు హైదరాబాద్ లో ఎక్కడైనా ఎలాగైనా నివసించవచ్చు. అమరావతిలో అవకాశాలు కొన్నివర్గాలకే అన్నది సుస్పష్టం అన్నది అందరికి తెలుసు. ప్రధాని నరెంద్ర మోడీకి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. అంతా తెలిసి మోడి ఊర్కున్నాడంటే ఆయన దాన్ని రాజకీయ వ్యూహంలో భాగం చేసి ఎప్పుడో పునాలదుకే ప్రమాదం తెస్తాడన్నది జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ ఒక అఙ్జాని అయినా ఐ ఉండాలి లేకపోతే ఆయన రాజకీయ అండై నా కోరుకుని ఉండాలి.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరవాత రెండు రాష్ట్రాల మద్య సుహృద్భావ వాతావరణం ఏర్పడటానికి కారణం ఆంధ్రులు హైదరాబాద్ కు మనస్పూర్తిగా కనక్టై ఉండటమే కాక, ఇరుపక్షాల సామాన్య పౌరులు స్నేహశీలురు కావటం తప్ప రాజకీయాలు మాత్రం కాదు. 

Image result for special status to andhra pradesh

తొలినుండీ టిడిపి అధినేతవి తప్పుటడుగులే:  


హైదరాబాద్ నుండి అక్కడి అవినీతి నిరోదక శాఖ దెబ్బకి పారిపోయి వచ్చి కోట్లాది రూపాయల ప్రయోజనం వదులుకోవటం  రాష్ట్రానికి  అనర్ధం.  దేశ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పరువు ప్రతిష్ఠ పాతాళానికి చేరాయి. అది ఇతర రాష్ట్రా లలో నివసించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆంధ్ర ప్రధాన మీడియా మొత్తం టిడిపి కి అనుకూలమే. ఒక్క సాక్షి రాసినా అది ప్రభుత్వ వ్యతిరెకమనే ప్రచారం ముందే చెసేశారు. అందుకే రాష్ట్రంలో జరిగే తప్పుల తతంగం ఒక్క సోషల్ మీడియా మాత్రమే ఎత్తిచూపుతుంది.


కొత్తగా ఇల్లు కట్టుకునే వారు తమ ఇంట్లో ఉంటూ గృహనిర్మాణం సాగిస్తారు. అంటే హైదరాబాద్ ను రాజధానిగా పది పదిహేనేళ్ళపాటు వినియోగించుకుంటూ ఉంటే వాణిజ్య అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ అంత అమరావతి క్షమించండి హైదరాబాద్ నే కాదు ప్రపంచంలో మరే నగరం ఈస్థాయిలో ఉండనంత నగరం నిర్మాణం అయిఉండేది. మనిషి తలచు కుంటే అసాధ్యం ఉండదు.

Image result for special status to andhra pradesh

తాత్కాలిక భవనాల నిర్మాణం పేరుతో తో కోటానుకోట్ల ధన దుర్వినియోగం అందులో ప్రతి చద రపు అడుగు నిర్మాణంలో అవినీతి కొండ చిలువై కూర్చుందంటారు. నిర్మాణాలు నాసిరకమే నని ప్రజలందరికి తెలుసు.    

Image result for special category status states in india

తద్వారా తెలంగాణాలో క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉండే తెలంగాణా తెలుగుదేశం నాయకత్వ లేమితో తుడిచిపెట్టుకు పోయింది. ఉభయరాష్ట్రాల్లో దేదీప్యమానం గా ఉండాల్సిన ఒక తప్పుడు పనితో అతి చిన్న ప్రాంతానికే పరిమితమై పోవటానికి కారణమైన అధినేత సంస్థాగత విషయాల పై శ్రద్ద పెట్టకుండా తన తనయుణ్ణి మంత్రిని ఆపై ముఖ్యమంత్రిని చేయాలనే తపన కే అంకితం చేశారు. తన పార్టి బలపడాలనే దురాశతో విపక్ష శాసనసభ్యులను మభ్యపెట్టి కొనెయ్యటంతో ఇంకొంత ప్రతిష్ఠ దిగజారింది. దానికే నాలుగు సంవత్సరాల కాలం వృధా అయింది.


ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెంపు కోసం న్యూడిల్లీ చూట్టూత తిరిగిన అధినేత చంద్రబాబు తాను రాష్ట్రప్రయోజనాలకై 29సార్లు దేశ రాజధాని చూటూ తిరిగాననటం దౌర్భాగ్యం. డిల్లీ వచ్చిన  ప్రతిసారి ఆయన ఎవరిని కలిశారు ఏంచేశారు అన్న దానిపై అందరికి తెలిసిన చరిత్ర ఉందంట కేంద్ర దగ్గర. ఆయన స్వప్రయోజనంతో  “జమిలి కాని ఏ ప్రయోజనం”  ఆయన సాధించలేదనేది సైబరాబాద్ చరిత్రతోనే ప్రజలకు తెలుసు. 



ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదెశ్ కు ఇవ్వకూడదనే సంకల్పంతోనే కాంగ్రెస్ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చేర్చకుండా ఆ తరవాత కనీసం దీనికి అనుకూలంగా ఉనికిలో ఉన్న చట్టాలను సవరించటానికి ప్రయత్నించలేదు. అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఆంధ్రప్రదెశ్ కు ప్రత్యేక హోదా కు తగిన అర్హత ఉండదు. దీంతో కాంగ్రెస్ కుటిలనీతి వ్యక్తమౌతుంది. అందుకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎండమావే!

Image result for special category status states in india

ఇంత దిగజారిన అధినేత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రత్యేక హోదా విషయంలో అనుసరించక తప్పదు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వక తప్పని దుస్థితిలో అధికార తెలుగుదేశం పడిపోతుంది. నాడు టిడిపి వైసిపి ఎమెల్యేలను తన పార్టీలోకి లాక్కుని తప్పని పరిస్థితుల్లో వైసిపి అధినేత ప్రజా సంకల్పయాత్ర పేరుతో అరణ్యవాసం చేసేస్తు న్నారు. ఇప్పుడు టిడిపి పాపం పండింది ఇంత అధికార దర్పం ఉండి కూడా "ప్రజల బలం కూడగట్టుకుని ప్రత్యేక హోదాని వదల కుండా నాలుగేళ్ళు కూర్చొన్న జగన్"  ను అనుసరించటం టిడిపి తప్పకపోవటం టిట్-ఫర్-టాట్ జరిగి బూమరాంగ్ అయింది. నాన్-బిజెపి పార్టీలను కలుపుకొని ఉద్యమానికి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అప్పుడైనా వైసిపి ని టిడిపి అనుసరించాల్సి ఉంటుంది. 


సమయానుకూలంగా రంగులు మార్చే స్వభావమున్న  టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయం గాలివాటం. గంటకో సారి మనసు మార్చుకునే ఆయన ఎలా ముందుకు పోతారో కూడా చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: