పవన్ కల్యాణ్ లోకేశ్ పై చేస్తున్న విమర్శలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. లోకేశ్‌పై పవన్‌కల్యాణ్ అవినీతి ఆరోపణలు అర్థరహితమని చంద్రబాబు కొట్టిపడేశారు. ఆరోపణలు చేసేవాళ్లు వాటిని నిరూపించగలరా అని ప్రశ్నించారు. డబ్చే కావాలనుకుంటే లోకేశ్‌కు హెరిటేజ్‌ చూసుకుంటే సరిపోతుందని సమర్థించుకొచ్చారు. 

Image result for LOKESH PAWAN
హెరిటేజ్ ద్వారా ఏడాదికి 30కోట్ల వరకూ పన్ను చెల్లింపులు పోను 65కోట్ల వరకూ మిగులుతుందని చంద్రబాబు చెప్పారు. ఉన్నతంగా బతకటానికి అది సరిపోతుందని...,  ప్రజాసేవ కోసమే లోకేశ్‌ వాటిని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చారని సీఎం తెలిపారు. లోకేశ్‌ చిన్నతనంలో అర్ధరాత్రి అయినా తాను ప్రతిరోజూ చూసేవాడినని దేవాన్ష్‌ను వారానికి ఒక్కరోజు మాత్రమే చూసుకునే పరిస్థితి లోకేశ్‌దని సీఎం అన్నారు. 

Image result for LOKESH PAWAN
ఎన్డీఏలో ఉన్నంత వరకు ఇతర పార్టీలతో మాట్లాడేందుకు ఇబ్బందులు ఉండేవని..., ఇక తనకు ఎలాంటి మొహమాటాలు లేవని అన్ని జాతీయ పార్టీలను కలుపుకొని వెళ్తానని చంద్రబాబు అన్నారు. తన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలే అని స్పష్టంచేసిన చంద్రబాబు ప్రాంతీయ పార్టీ లే ఉండకూడదు అన్న రీతిలో జాతీయపార్టీలు  ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

Image result for LOKESH PAWAN
మరి చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం హెరిటేజ్ లాభం ఒక్క ఏడాదికే 65 కోట్లరూపాలు..మరి ఇన్నేళ్లుగా లోకేశ్ హెరిటేజ్ ద్వారా ఎంత సంపాదించారు.. అవి కాకుండా చంద్రబాబు కుటుంబాన్ని ఎన్ని ఆస్తులు ఉన్నాయి. మరి చంద్రబాబు ఎప్పుడు ఆస్తులు ప్రకటించినా అవన్నీ కేవలం వంద కోట్లలోనే ఎందుకు ఉంటున్నాయి. అంటే చంద్రబాబు అబద్దం చెబుతున్నారా.. ఏంటో ఈ లెక్కలు చంద్రబాబుకే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: