కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చని ఎంతో మంది నిరూపించరు.  అందరిలా కాకుండా తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం కోసం పరితపించే వారు..ఏదైనా సాధించాలని గట్టి తపన ఉన్న వారు తాము అనుకున్నది సాధించే తీరుతారు.  ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త పరికరాలు సృస్టించారు..సృష్టిస్తూనే ఉన్నారు.
बनना चाहता था आईएएस, लेकिन घर वापसी के बाद कर दिया ऐसा काम जिसे देख लोग रह गए दंग
తాజాగా 24 ఏళ్ల ఈ నవయువకుడు ఒక ఆటోగేర్ సైకిల్‌కు సోలార్ పవర్ సిస్టంను అనుసంధానించి ఈ అద్భుతం చేశాడు. ఒడిశాలోని బౌద్ద జిల్లాలోని మండక్చువానా గ్రామానికి చెందిన ఆకాశ్‌కుమార్ మెహర్ సోలార్ సైకిల్‌ను తయారు చేసి అందరినీ అబ్బుర పరిచాడు. ఆటోగేర్ సైకిల్‌కు సోలార్ పవర్ సిస్టంను అమర్చి ఈ సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్ గంటకు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆకాశ్ భువనేశ్వర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

బౌద్ధ్‌‌కు చెందిన కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగి తపన్ మెహర్ కుమారుడు. ఇప్పుడు సౌరశక్తితో నడిచే ఫోర్ వీలర్ రూపకల్పనపై దృష్టిసారించాడు. ఇందుకోసం ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాడు.

భారత దేశంలో ఇలాంటి అద్భతమైన పరికారాలు తయారు చేస్తున్న ఔత్సాహికులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తీసకు వచ్చిన వారి పరిజ్ఞానాన్ని పది మందికి పనికి వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: