నిన్న అంటే శనివారం ఆంధ్రజ్యొతి ఆన్లైన్లో పబ్లిష్ అయిన చిన్న రైటప్ చూడండి......... మీడియాలో ముదిరిన వ్యక్తుల స్వార్ధం చివరకు ఏస్థాయిలో 'స్లో-పాయిజన్లా' జనం మస్థిష్కంలోకి ఎక్కించటం ఎలాగో? తెలుస్తుంది. తమ స్వంత భావాలను ప్రజలకు విపణి కోణంలో ఎలా సరపరా చేయొచ్చో ఆంధ్రజ్యోతి నిరూపిస్తుంది. "మిత్ర ధర్మం... మిథ్య!"  అనే పేరుతో.....ఒక వ్యక్తికి,  ఒక రాజకీయ నాయకునికి, ఇంత ప్రచారం చేయవలసిన అవసరం ఆ పత్రికకు ఎందుకొచ్చింది?

Image result for paccha media supports chandrababu

"----అది వాజపేయి హయాం! సొంత పార్టీకి చెందిన సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ రాష్ట్రానికి చెందిన ఒక అంశాన్ని ప్రధాని ముందుంచారు. "చంద్రబాబును చెప్పమనండి! ఆయన చెబితే చేద్దాం" అని వాజపేయి సూటిగా చెప్పారు! చంద్రబాబు అంటే వాజపేయి, ఆడ్వాణీలకు అత్యంత గౌరవం!

Image result for vajpayi advani chandrababu 

ఇప్పుడు... మోదీ వద్దకు వద్దాం! 2014 ఎన్నికల ముందు... ప్రచారం ఉద్ధృతంగా జరుగుతోంది! మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రచార సభలో మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితరులంతా పాల్గొన్నారు. వేదికపై ఒక కుర్చీపై మాత్రం ప్రత్యేకంగా పెద్ద టవల్‌ వేసి ఉంచారు. అది... మోదీ కోసం! కుర్చీలో కూర్చోవాలని మోదీని కోరి... చంద్రబాబు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబోయారు.

Image result for modi chandrababu dispute difference

మోదీ అందుకు నిరాకరించారు. చంద్రబాబు వద్దన్నా వినకుండా, బలవంతంగా లాగి మరీ తనకోసం ప్రత్యేకించిన కుర్చీలో ఆయనను కూర్చో బెట్టారు. తాను పక్కనున్న కుర్చీలో కూర్చున్నారు. ఎన్నికలు అయిపోయాయి! ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. తర్వాత మోదీని చంద్రబాబు ఢిల్లీలో కలిశారు. మోదీ ఏపీకి వచ్చారు. మోదీని కలిసినప్పుడల్లా చంద్రబాబు వంగి నమస్కారం పెట్టడమే! చివరికి... కొన్ని నెలలపాటు చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు! దటీజ్‌ మోదీ!----"

Image result for paccha media supports chandrababu

మనం కాస్త దురభిమానం మాని పై కథ లోని కథానాయకుణ్ణి గుఱించి చిన్నమాటలు మాట్లాడుకుందాం:

*మోడీ అలా ఎందుకయ్యారంటారు? మొదట బాబు అంటే ఏమిటో కొంచెం తెలుసు అనుకుందాం. అధికారం కోసం అందరూ ఇలాంటి పాట్లే పడ్డారనుకుందాం. మనింటికి వచ్చిన అథిదికి ఉచితాసనమే ఇస్తాం.

*మనం ప్రక్కనే కూర్చుంటాం. ఇందులో బాబు అదే చేశారు. ఇంత గొప్పగా చెప్పటమెందుకు. అదీ పబ్లిక్ లో ఇంకొంచం నటన ప్రదర్శిస్తారు. దీన్ని వార్తగా రాయాలా? ఈ ఆర్టికిల్ రచయిత ఇంటికి మేమెవరమైనా వస్తే ఉచితాసన మివ్వరా? 

*మోడీ కూడా గౌరవంగా ఆ ఆసనాన్ని స్వీకరించక ఆ ఆసన ప్రధాతనే కూర్చోబెట్తారు కదా! అది ఆయన గొప్పదనం కాదా! అది రాయలేదేం. వాజపేయికి అద్వాణికి చంద్రబాబుతో దోస్తీ ఉండొచ్చు. అంతమాత్రాన అదే గౌరవం మోడీ ఇవ్వలని ఉందా?

*2002 గోద్రా రైల్ దహనం జనహననం సబర్మతి పై దాడి జరిగి, 59 మంది జనం మరణించిన రోజుల్లో, నరెంద్ర మోడీ హైదరాబాద్ వస్తే అక్కడే నుండే జైలుకు పంపు తానన్న చంద్రబాబులోని కుతంత్ర రాజకీయం కాదా?  ఏ సంభంధం లేని బాబు ఆనాడు ముస్లిం ఓట్లు ఎక్కడ పోతాయనే అలోచనతోనే  "ఆ ప్రకటన చేయలేదా? మోడీది నేరమైతే దాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయి. రాజకీయపార్టీగా మీరు ఆయన విధానం ఖండించండి.  బాబు కెందుకు దురద?"

*ఒకవేళ మోడీ నేఱస్థుడని భావిస్తే మరి 2014లో మైత్రి నెరపటమెందుకు. అంటే బాబుది అవకాశ వాదమేగా? దాన్ని మరి ఈ పత్రిక ప్రవచించదేమి? ప్రచురించదేమి?

Image result for paccha media supports chandrababu

ఇక అసలు విషయానికి వద్ధాం.

ఈ మీడియా బాధపడట మెందుకు? చంద్రబాబు ఆ మాత్రం ఆ సమస్యను పరిష్కరించుకోలేరా? ఏ లెక్కలు తప్పాయో? ఎవరికి తెలుసు. పసలేని వార్తలతో పచ్చ పత్రిక పచ్చ పచ్చ పార్టీ అధినేతకు పచ్చ పచ్చగా అనుకూలంగా  రాయటంలోని వృత్తి రహస్యం ఏమిటి? అందరికీ ఇదే అనుమానం.  ఇంతగా తెగించి మద్దతి వ్వాలా? ఇక్కడ ఏ స్వార్ధమూలేదా? 

ఈ పచ్చ పత్రికలు తెచ్చిన సాంప్రదాయమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కుల మత ప్రాంత పార్టీ వర్గ ప్రాతిపదికన పత్రికలు మీడియా చానల్స్ వార్తలు పంపిణీ చెసే స్థాయికి దిగజారింది. ఈ దుష్టసాంప్రదాయం స్థిరపడటానికి కారణమైంది. 

అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంవలననే కేంద్రం సహకరించటం లేదంటు న్నారు కొందరు విఙ్జులు. కారణం పోలవరం లో జరిగిన అవినీతని, ఓటుకు  నోటులో కేసని, నేఱమయమని తెలిసినా ట్రాన్స్-ట్రాయ్ కి కాంట్రాక్టివ్వటమని , కేంద్ర పథకాలను దారి మళ్ళించటమని, శంఖుస్థాపనలు పేరిట జరిగిన దుబారా అని, కాపిటల్ నిర్మాణం పేరుతో అనేక దేశాలు తిరగటమని అదీ మందీ మార్భలంతో, రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతని రకరకాలుగా చెప్పేది మీకు తెలియదా?

22 మంది ప్రతిపక్ష సభ్యులను కొనటానికి నంద్యాలలో గెలవటానికి వందల వేలకోట్లు ఎలా వచ్చాయో? రికార్డులు అన్నీ మోడీ దగ్గర భద్రంగా ఉన్నాయని  అంటున్నారు. ఆ పాపపు కాలనాగులు ఎప్పుడైనా బయటకు రావచ్చని అంటున్నారు. అందుకే మోడీ “అడుసు తొక్కనేల - కాలు కడుగనేల” అనే పద్దతిలో బాబుకు దూరంగా ఉంటూ ఉన్నారేమో? 

ఇక్కడ ఒక్క మోడీని కేంద్రాన్ని నిందిస్తే సరిపోదు. మన బంగారం గుఱించి కూడా ఆలోచించాలి. అసలు "ఓవర్ నైట్ హైదరాబాద్ టు అమరావతి కాపిటల్ చెంజ్ లోని కూటనీతి రహస్యం" బయటకు రావాలి. అంతకు మించిన పోలవరం - ట్రాన్స్-ట్రాయి అనుబంధం అందులోని అవినీతి గుట్టు బయటపడాలి. అది చేయలేని మీడియా  "చంద్ర బాబు-చక్కభజన" మానేసి నిజం బయట పెడితెనే, జనపక్షం వహిస్తే ....ఒక అద్భుతం జరుగుతుంది.

Image result for vajpayi advani chandrababu


ఇప్పుడు మోడీ మహనీయుడని చెప్పట్లేదు ....ఇట్జ్ ఫర్ ష్యూర్.  

Image result for paccha media supports chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: