ఆంధ్రప్రదేశ్ కు  'ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ప్రత్యేక హోదా'  పై "తెలంగాణ బీజేఎల్పీ" నేత కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు "ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదా" ఇస్తే దేశంలో అశాంతి ఏర్పడుతుందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేహక్కు స్వపక్షంతో కలిపి విపక్షానికే కాదు దేశంలోని అన్నీ పార్టీలకు ఉందని, ఆ అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో అన్ని విషయాలు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్వదా సిద్థంగా ఉన్నారని అన్నారు. 
Image result for T-BJLP leader Kishan Reddy
ఏపీకి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి విషయమై శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. "ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామని తిరుపతి సభలో ఎవరో ఇచ్చిన చీటీ చూసి అన్నారు. ప్రత్యేక హోదాపై అప్పుడు మోదీకి సరైన అవగాహన లేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి (హోదా) ఇస్తే దేశంలో అశాంతి నెలకొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకే ప్రత్యేక ఆర్ధిక సహకారం (స్పెషల్‌ ప్యాకేజీ) ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది అని చెప్పారు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందని, ఆందోళన అవసరంలేదు" అని తెలిపారు.
Kishan 
"ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందనటం సరికాదని, కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి (ప్రత్యేక హోదా) విషయంలో అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని ఏపీలోని ప్రభుత్వ మరియు ప్రతిపక్ష పార్టీలకు హితవు చెప్పారు. 2019లో రానున్న ఎన్నికల్లో జనసేన, వైసీపీ లతో బీజేపీ పొత్తు అంశం ఇప్పటి వరకు పార్టీలో చర్చకు రాలేదని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్షనేత గా జగన్‌మోహన్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వమే గుర్తించగా లేనిది, ప్రధాని మోదీ జగన్‌మోహన్ రెడ్డికి అపాయింట్‌మెంట్‌ ఇస్తే తప్పేంటి" అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Image result for narendra modi promised special status to AP in tirupati

చెప్పినమాట ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందనటం సరి కాదని,  ప్రత్యేక హోదా విషయంలో అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: