Image result for special status category state & andhra pradesh

చంద్రబాబు నాయుడుగారి సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిశీలించి చూస్తే-ఆయన వ్యక్తిగతం గా జనాకర్షణ లేనినాయకుడు. ఆయన సభలకు ఆయన జనాల్ని రప్పించింది ఇంతవరకు లేదు. ఏదో ఒక పార్టీ తో పొత్తు, కుల, వర్గ, ప్రాంత సమీకరణాలు ఆయన విజయ రహస్యం. అంతా మేధమటిక్స్. కూడికలు, తీసివేతలు అవసరమైతే మల్టిప్లికేషన్ లెక్క తప్పితే డివిజన్. అంటే డివైడ్ అంద్ రూల్. ఇదీ దాదాపు నాలుగు దశాబ్ధాలుగా చంద్రబాబు విజయ రహస్యం.

తొలుత కాంగ్రెస్ పార్టీలో విదార్ధిగానే రాజకీయ జీవితం ప్రారంభించి ఇందిరాగాంధి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజుల్లోనే నాటి కాంగ్రేస్ నాయకుడు ఇందిరాగాంధి తనయుడు సంజయ్ గాంధికి అతి సన్నిహిత మద్దతు దారుడుగా ఉన్నారు.

N. Chandrababu Naidu.jpg

దీన్ని బట్టి అవతలివారు ఎలాంటి వారైనా అధికారం వెంటే ఆయన పరుగెత్తుతారు. అది లేకుంటే ఆయన శ్వాస ఆగిపోతున్నట్లు ఫీల్ అవుతారు. ఉదాహరణకు ప్రత్యెక హోదా రాష్ట్రానికి రాదని అది ముగిసిన అధ్యాయమని చెప్పిన తానే అది మాత్రమే సంజీవని కాదు అని నిండు శాసనసభలో ప్రవచించారు. ఆమాట మీదే తను నిలబడి ప్రత్యేక పాకేజీ కోసం ప్రయత్నిస్తే ఆయన చంద్రబాబు ఎలా ఔతారు.

అయితే ఒక వైపు ముఖ్యంగా వైసిపి, మరోవైపు రాష్ట్ర విభజన ప్రయోజనాల సాధన సమితితో కూడిన కొన్ని ప్రజాసంఘాలు "ప్రత్యెక హోదా" అంశాన్ని ప్రజల్లో బ్రతికిస్తూ వస్తున్నాయి.  ప్రజల్లో ప్రత్యేక హోదా పట్ల ఉవ్వెత్తున ప్రభలిన భావోద్వేగాలకు జడిసి నాలుగు సంవత్సరాల బాజపాతో మైత్రికి క్షణాల్లో తిలోదకాలిచ్చి "39 సార్లు డిల్లీ చుట్టు తిరిగాను ప్రయోజనాలేకాదు కనీసం ప్రధాని అపాయింట్మెంటే దొరకలేదని - ఏ-1 ఏ-2 ముద్దాయిలైన వైసిపి ప్రముఖులకు మాత్రం ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు” అని అంటూ- కడుపులో మంట" బయట పెట్టుకున్నారు. వాళ్ళు ముద్దాయిలైనా మహాత్ములైనా ప్రజల్లో మీలాగే గెలిచారన్న సాధారణ ఙ్జానం ఆయనకు లేకపోవటం దురదృష్టం. 

Related image

నేఱగాళ్ళైన వారిని ప్రస్తుతానికి చట్టసభల్లో ప్రవేశాన్ని నిషేధించే చట్టాలు లేవు కదా! అలాగే చంద్రబాబు గారు జగన్మోహనరెడ్డి గారిని పదేపదే నేరగాడని, అనుభవం లేదని నిందించటం ఆయనకే అనర్ధం. అనుభవఙ్జుడు కాకపోయినా ఆయనకు శాసనసభ్యుడయ్యే అర్హతలు ఉండబట్టే గా ఆయన ఎమెల్యే అయింది.

ఏ అర్హతలుండి బాబు తనయుడు మంత్రివర్యులు అయ్యారు. ఇవి ఇక నరెంద్ర మోడీ బృందం బాబుపై వేయనున్న బాణాలు. ప్రపంచాన్ని విస్తుపోయేలా చ్రేసిన బాబు చర్య నేరగాడని ప్రజలు ఆయన్ని "ఓటుకు నోటు కేసు" లో నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు జగన్ వైపు ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు ఆయన్నే చూపిస్తాయి.

Image result for special status category state & andhra pradesh

అసలు 2014వ సంవత్సరంలోనే ప్రత్యేక హోదా రాదనే విషయం బాబుకు తెలుసు. ప్లానింగ్ కమీషన్ 13.06.2014 నాడే తన పబ్లికేషన్ లో తెలిపింది. కావాలని ప్రజలను ఈ రాజకీయ పార్టీలు మోసం చేస్తూ వచ్చాయి. దిక్కులేని పరిస్థితుల్లో 2016 చివర్లో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక పాకేజ్ ప్రపోజ్ చేసిన తెలుగు దేశం పార్టీ నేడు పరువు ప్రతిష్ఠ ప్రజల్లో పోగొట్టుకుంది. టిడిపికి తన వర్గ ఆధిపత్య మీడియా మద్దతు వలన బ్రతికిపోతుంది లేకున్ టే ఏనాడో శంకరగిరి మాన్యాలు బట్టి పోయేది.   

గతంలో నందమూరి తారక రామారావు ప్రజాకర్షణ ఆ తరవాత బాజపా, కమ్యూనిష్టుల సహకారంతో అధికారంలోకి వచ్చింది. జనతా పార్టి ప్రయోగ వైఫల్యం చెందటంతో ఏ మిత్రులూ దొరకక, అధికారానికి రెండు దఫాలుగా దూరమైంది. ఆ తరవాత గతం లో తన మోసానికి బలైన బాజపా మైత్రి తో పవన్ కళ్యాణ్ మద్దతుతో 2014లో అధికారం లోకి వచ్చింది. అందుకే ఎవరిసహకారమో లేక పోతే తెలుగుదేశం స్వంతంగా ప్రజల్లో గెలవటం కల్ల.

Image result for special status category state & andhra pradesh

వాపుని చూపి బలుపని బ్రమసింపజేసి బ్రతుకుతూ వస్తున్న ఈ నాయకుని వల్ల దేశానికి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. సైబరాబాద్ ను నేనే నిర్మించాని చెప్పే బాబు అనుయాయులు అందులో దోచుకున్నదెంత? ఏ స్వప్రయోజనం లేని పని ప్రజల కోసమని బాబు చేయరని అంటారు. అది అమరావతి నిర్మాణమైనా, ప్రత్యేక పాకేజీ ఐనా, పోలవరమైనా అంతే. వీటిపై విచారణ సంఘాన్ని వెస్తే తెలుగుదేశం పాములు దాక్కున్న వైసిపి చీమల పుట్టలు కరిస్తే పాపాల పాములు బయట పడేది ఖాయం.

Image result for special status category state & andhra pradesh

కేంద్రంపై వైసిపి అవిశ్వాసం పెడితే దానికి మద్దతిస్తానని శాసనసభ సాక్షిగా చెప్పిన బాబు ఒక్క రాత్రికే విషయాన్ని తలకిందులు చేసి నాటకం ఆడటం లో ఏదో రాజకీయ కుతంత్రం ఉండే ఉంటుంది. ఇక అవిశ్వాసం సభలో చర్చకు రాదు. అక్కడ ఉన్నది మోడీ బాబుగారి బాబే ఆయన. నిర్దాక్షిణ్యంగా ప్రతిపక్ష ఎమెల్యేలను కొనేసిన దుర్మార్గపు రాజకీయం శాసనసభలో సభాపతి పౌరోహిత్యంలోనే జరిగింది. అదే పాపం నేడు పార్లమెంటులో జరుగుతుంది.

తప్పులన్నీ మీరు చేసినవే. తెలుగు రాష్ట్రాల శాసనసభాపతుల తీరు పార్లమెంటులో ప్రతిబింబి స్తున్న వేళ ఎవరూ పీకే దేమీ లేదు. "ధట్స్ ఆల్ ఇన్ ది గేం"    

అందరూ గుర్తించాల్సిందేమంటే చంద్రబాబు ఎంచేసినా అందులో తొలుత తన తరవాత తన కుటుంబం ఆపై తన వర్గం ప్రాధమ్యాలు ప్రాధాన్యత సంతరించు కుంటాయి తప్ప ఆయన చెప్పే ప్రజల మేలు తన నిప్పు తనం మొత్తం శుష్క ప్రియాలు శూన్య హస్తాలే.   

చంద్రబాబు నైజం గురించి ఆయన మామ గారు నందమూరి గారి స్వంతమాటల్లోనే వినండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: