ఒక నాయకుడు అంటే ప్రజల కష్ట సుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకొని వారి ఇబ్బందులు తీరే విధంగా శాయశక్తులా ప్రయత్నించినపుడే ప్రజలు నమ్ముతారు..తిరిగి ఆ నాయకుడికే ప్రాధాన్యత ఇస్తారు.  కానీ ఈ మద్య కాలంలో కొంత మంది నాయకుడు ఎలక్షన్లలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగి..వారి కష్టాలు పట్టించుకోకుండా ముఖం చాటేసే వారు చాలా మంది ఉన్నారు.  కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన నియోజక వర్గంలో ప్రజలు పడుతున్న కష్టాలు విని..ఆ కష్టాలు ఏంటో ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నంలో భాగంగా స్వయంగా బస్ ప్రయాణం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
Image result for ఎమ్మెల్యే వివేక్
ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా..కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ‘బస్సు ప్రయాణం’ ప్రారంభించారు. కుత్బుల్లాపూర్‌లోని వివేక్ తన నివాసం నుంచి కాలినడకన సాధారణ ప్రయాణికుడిగా బస్టాప్ వరకు వచ్చి 9క్యూ సుభాష్‌నగర్ నుంచి సీబీఎస్ ఆర్డినరీ బస్సును ఎక్కి అసెంబ్లీ వరకు వివేక్ తనతో పాటు పీఏ, ఇద్దరు గన్‌మెన్‌లకు టిక్కెట్‌ను తీసుకున్నారు. బస్సులో కాలేజీ విద్యార్థి లేచి వివేక్‌కు సీటును ఇచ్చాడు.  ఈ క్రమంలో బస్సులో వివేక్ తోటి ప్రయాణికులతో మాట్లాడి రోజూ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

ఉపాధి, పని కోసం బస్సులో వెళ్లే వారితో మాట్లాడారు. రద్దీకి అనుకూలంగా బస్సులు ఉన్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. బస్సు సకాలంలో గమ్యానికి చేరుకుంటుందా లేదో ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని కనుక్కున్నారు.   ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థి, కాలేజీకి బస్సులో వెళ్లిన రోజులను వివేక్ గుర్తుచేసుకున్నారు.   పరీక్షలకు ట్రాఫిక్ సమస్యతో చాలా ఆలస్యమవుతుందని విద్యార్థినులు తెలిపారు. బస్సు కండక్టర్‌కు ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బస్సు సకాలంలో గమ్యానికి చేరుకుంటుందా లేదో ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని కనుక్కున్నారు.
Image result for traffic problems hyderabad
అసెంబ్లీ ఆల్ ఇండియా రేడియో బస్టాప్ వద్ద దిగిన ఎమ్మెల్యే వివేక్ శాసనసభ హాల్‌లోకి కాలినడకన చేరుకున్నారు. వివేక్ మాట్లాడుతూ ఎప్పటి నుండో అసెంబ్లీకి బస్సులో వచ్చి సమస్యలను తెలుసుకోవాలని అనుకున్నానని ఇప్పటికి సాధ్యమైందని చెప్పారు.బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్ సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: