కెసిఆర్ తను కొత్త రాజకీయసమీకరణం కోసం ముందుకొచ్చి మీడియాతో మాట్లాడిన రోజున పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జి కెసిఆర్ కు ఫొన్ చేసిందన్న కెసిఆర్ మాటలు తెల్లవారే అభద్ధాలని కొల్కత్తా నుండి పబ్లిష్ అయ్యే ది టెలిగ్రాఫ్ పత్రికలో కెసిఆరే మమతకు ఫొన్ చెశారనే విషయం న్యూస్ కటింగ్ తో సహా తెలంగాణా జె ఏ సి తన ఫెస్-బుక్ అకౌంట్ లో వివరించింది. ఇది చదివి కెసిఆర్ నాటకాలు తెలుసుకొని వారిదృష్టిలో పరువు పోగొట్టుకున్నారు.

Image result for failure meet of kcr with mamata

అయితే నిన్న కోల్కతా వెళ్ళిన టిఆరెస్ బృందానికి మరోసారి మమత షాకింగ్ ఫేస్ ఎదురైందట. అసలు కథేమంటే:

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తూ సరికొత్త రాజకీయ సమాఖ్య ఏర్పాటు చేయాలనే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నాలకు ఆదిలోనే హంస పాదైందని తెలుస్తోంది. బీజేపీ తో దాదాపు పోరాటమే చేస్తూ దాని వ్యవహారశైలి మీద నిప్పులు చెరుగుతున్న మమత బెనర్జి కొన్నాళ్లుగా జాతీయస్థాయిలో రాజకీయాల మీద తన దృష్టి పెట్టి వివిధ రాజకీయ పార్టీలతో సమాలోచనలు జరుపుతున్నారు.


ఇప్పుడున్న పరిస్థిల్లో కాంగ్రెస్ సహకారం లేకుండా నూతన రాజకీయ సమీకరణం సమాఖ్య (ఫ్రంట్) సాధ్యం కాదని ఆమె గ్రహించారట. ఇదే విషయాన్ని తనతో సమావేశం లో కెసిఆర్ తో ప్రస్తావించారట. కాంగ్రెస్ లేకుండా బాజపాకు ప్రత్యామ్న్యాయ రాజకీయ సమాఖ్య ఏర్పాటు అసలెలా సాధ్యం అవుతుందని ఆమె అడిగిన ప్రశ్నకు తెరాస నేతల వద్ద ఎలాంటి సమాధానం లేక చాలా ఇరకాటంలో పడ్డారట.

Image result for failure meet of kcr with mamata

అయితే కెసిఆర్ తెలంగాణా రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ తో వున్న పోటీని దృష్టిలో ఉంచుకునే ఇంత సంకుచితంగా వ్యవహరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తలు ఆమెకు ముందుగానే ఉప్పందించటం తో ఆమె చాలా సంయమనం వ్యవహరించి చర్చను ప్రస్తుత పార్లమెంట్ ఉభయ సభల్లో జరుగుతున్న పరిణామాలవైపు మరలించారట. బీజేపీ మీద పోరాటం అని మాకు చెపుతూ అటు పార్లమెంట్ ఉభయ సభల్లో వారికే ఎందుకు సహకరిస్తున్నారని ఆమె సూటిగా అడిగిన ప్రశ్నకు కేసిఆర్ బృందం నీళ్ళు నమిలినట్లు తెలుస్తుంది.


టిఆరెస్ బృందంతో సమావేసం తరువాత ప్రెస్ పాయింట్ ముందు కెసిఆర్ చెప్పిన మాటలు పునఃశ్చరణ చేయడానికి మమత బెనర్జి ఎలాంటి ఆసక్తి చూపలేదని ఆమె మాట్లాడిన  పద్దతి చూస్తే మనకు కూడా అర్ధం అవుతుంది.

Image result for failure meet of kcr with mamata

జాతీయ రాజకీయాల్లో కీలకమైన బీజేపీ, కాంగ్రెస్ లను వదిలేసి వారికి సరిసమాన రాజకీయ సమాఖ్య ను ఏర్పాటు చేయాలని మమత తొలుత భావించారట. కాని ఆమె పరిశోధన మేరకు అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ఆమె గుర్తించారట. అందుకే మొదట కాంగ్రెస్ సాయంతో ముందు బీజేపీని రాజకీయంగా నిలువరించి  ఆ తరవాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలను నడపాలని ఆమె అనుకుంటున్నారట.

Image result for failure meet of kcr with mamata

అందుకోసమే మమత కాంగ్రెస్ విషయంలో చంద్రబాబుని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, దేశ రాజధానిలోని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విషయమే. అయితే మరాఠా నాయకుడు ఎన్సిపి అధినేత శరద్ పవార్ తో మాట్లాడి మమతా బెనర్జీ అటు కాంగ్రెస్ ను, ఇటు టీడీపీ లను ఒకే రాజకీయ సమాఖ్య లోకి తెచ్చే వ్యూహాన్ని ఆమె అమలుచేస్తున్నట్లు ఇప్పటికే తెలుస్తుంది. భాజపాయేతర కూటమికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచే ప్రతిపాదనపై తొందర వద్దని, భావసారూప్య పార్టీలన్నిటితో చర్చలు జరగనివ్వాలని కేసీఆర్‌కు సూచించారని వినికిడి.


ఈ నేపథ్యంలోనే శరద్‌పవార్‌ ఇంట జరగనున్న సమావేశానికి  "భాజపాయేతర పార్టీలు"  ఎన్ని (?)  హాజరవుతాయి అనేది  ఆసక్తి కరం. వాటి సంఖ్య తక్కువగా ఉంటే భాజపాయేతర పార్టీల్లో అత్యధికం కాంగ్రెస్‌ నాయకత్వంలో ఏకమయ్యేందుకు సుముఖంగా కూడా లేవనే సంకేతాలు వెలువడుతాయి.

Image result for sarad pavar & mamata

ఒకవేళ అధిక సంఖ్యలో విచ్చేస్తే,  ఆ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి భాజపాతో తలపడేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం లో పనిచేయటానికి సిద్ధమనే అభిప్రాయం కలుగుతుంది. ఇదే జరిగితే కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న భాజపాయేతర, కాంగ్రెస్సేతర మూడో కూటమికి అవకాశాలు సన్నగిల్లినట్లేనని రాజకీయ పండితుల విశ్లేషణ.


దీన్ని బట్టి మన కెసిఆర్ దేశ రాజకీయాల్లో ప్రవేశం దాదాపు అసాధ్యమేనని ఋజువౌతుంది. ఒక వేళ ప్రవేశం అయినా నాయకత్వం దొరకటం అంత తేలికకాదని తెలుస్తుంది. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎదుర్కోవటానికే ఆయన పోరావలసి వస్తుందని తెలుస్తుంది.

Image result for failure meet of kcr with mamata

మరింత సమాచారం తెలుసుకోండి: