ఉన్నత విద్య అభ్యసించాలన్న తాపత్రయం..ఆ తల్లికి ఎలాంటి అడ్డు రాలేదు. చంటి పిల్లను తీసుకొని పరిక్ష హాలుకు వచ్చి పరీక్ష రాసింది.  అఫ్గనిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల జహాన్ అనే మహిళ తన చంటి బిడ్డను ఒడిలో ఉంచుకుని పరీక్ష రాసిన సంఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది.  వివరాల్లోకి వెళితే.. జహాన్ తాబ్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఆమె భర్త వ్యవసాయదారుడు..కానీ జీనత్ కి ఉన్నత విద్యనభ్యసించాలనే కోరిక ఉంది. 
Image result for exams
అందుకు ఆమె భర్త కూడా సహకరిస్తూ వస్తున్నారు.  దీంతో పట్టు విడవకుండా చదువును కొనసాగిస్తోంది.  ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్‌ సైన్స్‌ కోర్స్ లో చేరడానికి ఓ యూనివర్సిటీ నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకుంది. ఆ పరీక్ష తేదికి రెండు నెలల ముందే ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది.  దాంతో ఆమె తన బిడ్డను తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చింది. 
Image result for exams
చిన్న పాప కావడంతో పరీక్ష రాస్తున్న సమయంలో గుక్కపట్టి ఏడుస్తుండటంతో ఆమె తన సీటు లోనుంచి లేచి బిడ్డను తీసుకుని వచ్చి కింద కూర్చొని పాలిస్తూ పరీక్ష రాసింది. ఓ లెక్చరర్ ఆ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఆ లెక్చరర్ కొన్ని కారణాలతో తన పోస్ట్ ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఈ ఫొటోను చాలా మంది షేర్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: