ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు.. ఇక ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఓటేసే అవకాశం ఉంటుందో లేదోననే ఉత్కంఠకు తెరపడింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు ఓటేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికల నాటికి సభ్యులుగా ఉన్నవారికే ఓటేసే అవకాశం ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శికి పంపిన లేఖలో పేర్కొంది. తమ శాసనసభ సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు స్వల్ప ఊరట లభించింది. 

Image result for telangana assembly fire

మరో ఆరు నెలలపాటు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ స్టే ఇచ్చింది. ఇక ఆ ఇద్దరికీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కార్యదర్శిని కోరింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించగా పై విధంగా స్పందించింది. ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీసుకున్న కఠిన నిర్ణయం అనేక పరిణామాలకు దారితీసింది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని ఎన్నికల కమిషన్ కు నివేదించడం చకచకా జరిగిపోయాయి. 

Related image

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇక నుంచి మాజీ ఎమ్మెల్యేలంటూ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే అన్నారు. మరోవైపు తమ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్ కు లేదని, దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన బలం లేకున్నా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తో కాంగ్రెస్ నామినేషన్ దాఖలు చేయించింది. ఏదైనా మ్యాజిక్ జరగకపోతుందా.. అని ఆశగా ఉన్న కాంగ్రెస్ కు ఇద్దరు సభ్యత్వాల రద్దుతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం పదమూడు మంది ఎమ్మెల్యేలు. ఇందులో ఇద్దరి సభ్యత్వాలు రద్దు కావడంతో బలం పదకొండుకు పడిపోయింది. 

Image result for election commission

అయితే ఈ ఇద్దరికీ ఒటేసే అర్హత లేదు. ఖాళీ గా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 22న మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. అసెంబ్లీ వీడియోలు సమర్పించడానికి తమకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దీంతో కేసు విచారణ ఈ నెల27న చేపట్టనుంది. ఈ నేపథ్యంలో  ఉప ఎన్నికలు తప్పవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: