నేడు  రాజ్యసభ ఎన్నికలు  జరుగనున్నాయి. మొత్తం 58 స్థానాలకు గాను 33 మంది అభ్యర్థులు 10 రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 25 స్థానాలకు ఓటింగ్‌ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌తో సహా ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 6 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఏపీలో మూడు స్థానాలు ఏకగ్రీవం కాగా, తెలంగాణలో మాత్రం ఎన్నిక అనివార్యమైంది.మొత్తం 90మంది సభ్యులు ఆ పార్టీకి ఉండగా, ఏడుగురు మజ్లిస్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దయింది. దీంతో మొత్తం పది ఓట్లు ఎన్నికల్లో తగ్గుతాయి. 
Image result for రాజ్యసభ ఎన్నికలు
శాసనసభ కమిటీ హాలులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి ముగ్గురు బరిలో ఉండగా, కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని నిలబెట్టింది. కాగా, మూడు స్థానాలనూ తామే గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా తమ అభ్యర్థిగా గెలుపొందుతాడని కాంగ్రెస్ భావిస్తోంది. 
Image result for రాజ్యసభ ఎన్నికలు
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజ యం సాధించి, రాజ్యసభలో బలం పెంచుకోనుంది. యూపీ నుంచి బీజేపీ తరఫున అరుణ్‌జైట్లీ, అశోక్‌ బాజ్‌పేయ్‌, విజయ్‌ పాల్‌ సింగ్‌ తోమర్‌, సకల్‌ దీప్‌ రాజ్‌భర్‌, కంట కర్దమ్‌, అనిల్‌ జైన్‌, హర్నాత్‌ సింగ్‌ యాదవ్‌, జీవీఎల్‌ నరసింహారావు, అనిల్‌ కుమార్‌ అగర్వాల్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తరఫున అభిషేక్‌ మను సింఘ్వీతో పా టు ఐదు స్థానాలకు గాను పశ్చిమబెంగాల్‌లో ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు: పది సీట్లకు పోటీ
ఎస్పీ వద్ద అదనంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో బీఎస్పీ గెలుస్తుందని భావించినా.. ఇండిపెండెంట్లతోపాటు ఎస్పీలోని శివ్‌పాల్‌ వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకే నేడు ఎన్నికలు జరుగుతాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: