ఇది ప్రజాస్వామ్య దేశం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజాస్వామ్యమే ఉంది. ప్రతి ఒక్కరు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకోవాల్సిన పనిలేదు. అలాగే ప్రతిపక్షాన్ని శాసన్ అసభలో లేకుండా చేసిన ఆధునిక నియంత చంద్రబాబు విజయసాయి రెడ్డిపి "ఎం ఓ లో తెరుగుతున్నారు - మీడియా వాళ్లకు కనిపించకుండా కుర్చీల మాటున నక్కి కూర్చున్నరని చెప్పటానికి సంశయించని దివాళా కోరు తనం తెలుగు జాతికి కావలసినత అప్రతిష్ఠ తెచ్చిపెట్టిందని ప్రజలంతా అంటున్నారు.  


పి ఎం ఓ దేవాలయం కాదని, చంద్రబాబు నాయుడు మిరాసిదారుడు కాదని పి ఎం ఓ కి వెళ్ళి మాట్లాడి పనులు చేయించుకునే హాక్కు బాబు కెంతుందో విజయసాయికి అంతే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల విరుచుకుపడ్డారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడని ఆయన పీఎంవోలో తిరిగితే తప్పేంట ని ప్రశ్నించారు. ఎవరితో లాబీయింగ్ లు చేయాల్సిన గతి బీజేపీకి పట్టలేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.
Image result for sudhish rambhotla bjp & posani krishna murali
బీజేపీతో పొత్తు తెంచుకున్నాక చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆరోపించారు. కుట్ర అనే పదాన్ని ఇటీవల టీడీపీ నేతలు ఎక్కువగా వాడుతున్నారని అయితే కుట్రలు ఎవరు చేశారో, ఎవరు చేయ గలరో ఎవరికి కుట్రల చరిత్ర ఉందో తెలుగు జాతికి బాగా తెలిసిందేనని రాంబొట్ల అన్నారు. 


బీజేపీ పవన్ కళ్యాణ్ ను వెనక నుండి ఆడిస్తోందని జగన్ తో జనసేన కుమ్మక్కయిందనీ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారంలో, కుట్ర పూరిత వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. బీజేపీని తిడతారని విమర్శిస్తారని తలచి పవన్ కల్యాణ్ సభకు టిడిపి నేతలు జనాన్ని తరలిన్చారని అయితే అక్కడ దృశ్యం తలక్రిందులవటం తో టిడిపి అధినేతలకు ధిమ్మదిరిగి పోయిందన్నారు. ఆపరేషన్ గరుడ ద్రవిడ అంతా ఒక ఫార్శ్ వ్యవహారమని అబద్ధమని అదంతా సినీ రంగం లో ఒక వైఫల్య కథానాయకుని ఊహాజనిత కథలని ప్రజల్లో ప్రచారం చేశారని అన్నారు. పదవీ వ్యామోహమున్న హీరో శివాజీ కూడా కారెం శివాజీ లాగా ఏదో పదవి వచ్చే వరకు ఇలాగే చేస్తుంటారని ఆయన ఎద్దేవా చేశారు. 
Image result for increasing opposition on TDP in AP society
ప్రత్యేక హోదాను అర్హత ఉన్న ఏ రాష్ట్రానికి కూడా తిరస్కరించలేదని సుధీష్ రాంభొట్ల అన్నారు. ఆ రాష్ట్రాలకు కేవలం ప్రత్యేకంగా నిధులు మాత్రమే ఇచ్చారని నీతి అయోగ్ ప్రతిపాదన లతోనే అలా ఇచ్చారని ఆయన వివరించారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారని చంద్రబాబును కూడా అందులో ఉండాలని కోరితే తిరస్కరించారని ఆయన చెప్పారు. 


అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నామని అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలో సీఎం చంద్రబాబు కోరుకోలేదని సుధీష్ రాంభొట్ల అన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర ప్రదేశ్ కె కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కర్ణాటకకు నిధులు ఎక్కువ ఇస్తున్నామనే మాటలో నిజం లేదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు తగినంతైనా అభివృద్ధి జరగలేదని ఆయన ప్రశ్నించారు.
Image result for sudhish rambhotla bjp & posani krishna murali
సినీపరిశ్రమను టార్గెట్ చేసిన తెలుగుదేశ పంచమాంగ దళాలపై సినీ నటరచయిత పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు మరోసారి సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పై ఎందుకు చంద్రబాబు ఇప్పుడు మాటఎందుకు మార్చారని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ ని అంగీకరించి ఆపై ప్రస్తుతం బీజేపీతో బెడసి కొట్టిన సన్నిహిత సంబంధాల కారణంగా నాలుక మడతేశారని - ఇక బాజపా దగ్గర తన వేషాలు కొనసాగనందునే చంద్రబాబు రాజకీయంగా యూ-టర్న్ తీసుకొని మాట మార్చా రని పోసాని తెలిపారు. ఆ సమయంలో హోదా అంటే జనాల్ని ముఖ్యంగా సినీ నటులను నడిరోడ్డుపై లాఠీలతో చితక బాధించారని ప్రజల కోరికను అణిచివేసేందుకు చేయాలసిన అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. 
Image result for sudhish rambhotla bjp & posani krishna murali
అంతేకాదు ప్రత్యేక హోదా కోసం చలసాని శ్రీనివాస్ రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తుంటే ఆయన చొక్కాను పోలీసులు చింపేశారని అలాంటప్పుడు ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు. ఇలా కఠినంగా అణిచి వేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా పై మాట్లాడటం చాలా అసహ్యంగా కంపరంగా ఆశ్చర్యంగా ఉందన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పై పోసాని కృష్ణ మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీపని లో లోకేష్ తో పాటు టీడీపీకి  చెందిన పదిమంది ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. కావాలంటే నారా లోకేష్ కి "నార్కో అనాలిసిస్ టెస్టు" చేయించండి. అది అబద్ధమైతే లోకేష్ కాళ్ళు మొక్కి ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోతా నని సంచలన సవాల్ చేశారు. 

Image result for sudhish rambhotla bjp & posani krishna murali

మరింత సమాచారం తెలుసుకోండి: