రాజకీయ నాయకులంటేనే జనంలో ఒకటే హడావిడి ఉంటుంది. అందులోనూ అధికారంలో ఉన్నవారు తమ ప్రాంతానికి వస్తుంటే అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు.. ఇప్పుడు ఫ్లెక్సీ కల్చర్ వచ్చేశాక ఈ హడావిడి ఇంకాస్త పెరిగింది. ఆ ఫ్లెక్సీలపై తమ నాయకుడి ఫోటో సైజులోనే తమ ఫోటో కూడా వేయించుకుని ఆ ఫ్లెక్సీలను సగర్వంగా ప్రదర్శిస్తారు. 

Image result for ashok gajapathi raju pusapati

ఐతే.. ఇక్కడే ఓ చిక్కు వస్తుంది. ఆ ఫ్లెక్సీల్లో వాడే భాషను డిసైడ్ చేసేది ఎవరు.. ఖచ్చితంగా సదరు నాయకుడైతే కాదు. సాధారణంగా గ్రామ, మండల స్థాయి నేతలకు భాషపై అంత పట్టు కూడా ఉండదు. అందులోనూ ఇది కాపీ పేస్టుల కాలం. అందుకే ఆ ఫ్లెక్సీ షాపు వాడు ఆల్రెడీ అంతకుముందు నాయకుడు వచ్చినప్పటిదో... లేక అలాంటి ఇంకొకటో కాపీ చేసి పేరు మార్చి ఇచ్చేస్తాడు. 


ఇదిగో ఈ ఫ్లెక్సీ చూడండి.. ప్రత్యేక హోదా కోసం కేంద్రమంత్రి పదవిని సైతం వదిలేసిన అశోక్ గజపతిరాజు వస్తున్నప్పుడు ఆయన ప్రాంతం వాళ్లు వేయించిన ఫ్లెక్సీ ఇది. అవును అంత త్యాగం చేసిన నాయకుడికి ఘనంగా స్వాగతం పలకాల్సిందే కానీ.. పాపం అశోక్ గజపతిరాజుగారి పేరు ముందు కొన్ని బిరుదులు తగిలించారు. అవి ఎవరు డిసైడ్ చేశారో కానీ.. పరమ చండాలంగా ఉన్నాయి. 


ఆ బిరుదులు అశోక్ గజపతిరాజు గారి పరువు తీసేలా ఉన్నాయి. సాధారణంగా పేదప్రజల ఆశాజ్యోతి, నిగర్వి, స్నేహశీలి వంటి రొటీన్ విశేషణాలు వాడతారు. కానీ ఇతగాడెవరో కానీ ఎక్కడ కాపీ చేశాడో కానీ.. పాపం రాజు గారి పరువు తీశాడు.. రాజు కళంకితుడు అట.. రతిరాజు అట.. బాబోయ్.. శరీర విహీనుడు అట.. అంటే బహుశా దేవత అని అర్థం కావచ్చేమో.. దిగంబరుడు అట.. అయ్యో పాపం రాజుగారు దుస్తులు బాగానే వేసుకుంటారే.. మృగరాజు, గుహంతరవాసి.. బాబోయ్.. ఇలాంటి కనీవినీ ఎరుగని బిరుదు ఎక్కడ తెచ్చాడో కానీ.. పాపం రాజుగారి పరువు గంగలో కలిపేశాడు..  ఇప్పుడీ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: