ఈ కాలంలో న్యాయబద్దంగా డబ్బు సంపాదించాలంటే..చాలా టైమ్ పడుతుందన్న విషయం తెలిసిందే.  అవినీతి తో సిగ్గు..మాన మర్యాదలు వదిలేసి అక్రమంగా సంపాదించే వారు చాలా మంది తయారయ్యారు.  ఇందుకోసం అమాయకులను మోసం చేస్తూ..ఈజి మనీ సంపాదిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చెలామణి రద్దు చేసిన తర్వాత రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి వచ్చాయి.  అయితే ఈ  మద్య కొంత మంది దళారులు..ఫేక్ నోట్ల వ్యాపారం చేస్తూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. 
Image result for నకిలీ నోట్ల దందా
మీ దగ్గర కేవలం కొన్ని వేల రూపాయల డబ్బుంటే చాలు..వాటితోనే కోట్లు సంపాదించవచ్చంటూ రాష్ట్రంలో నకిలీ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నారు.   మీ దగ్గర ఉన్నరూ.2 వేలు ఇచ్చి 8 వేలు తీసుకోండి..అంతకు మించి డబ్బు ఉంటే..రెడ్డింపు డబ్బు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. అయితే ఈ నకిలీ నోట్లను తీసుకున్న జనాలు...ఆ తరువాత పోలీసులకు అడ్డంగా బుక్ అవుతూ.. కటకటాలు లెక్కబెడుతున్నారు. తాము కొంత మంది చేతిలో దారుణంగా మోసపోయామని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. 
Image result for నకిలీ నోట్ల దందా
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువైపోవడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో ఇలా దొంగ నోట్లు చలామణి కేసుల్లో అరెస్టైన వారి కదలికలు, వారి కాల్ డేటా పై నిఘా పెట్టడంతో పాటు నయా మోసగాళ్ల గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హౌరా నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.10.20 లక్షల విలువైన నకిలీ నోట్లను డైరెక్టరేట్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (విశాఖ రీజనల్‌ యూనిట్‌) అధికారులు పట్టుకున్నారు.
Image result for నకిలీ నోట్ల దందా
వీరు ఈ నకిలీ నోట్లను బంగ్లాదేశ్‌ ప్రాంతంలోని ఫరకా పట్టణం నుంచి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.  డబ్బుపై వ్యామోహం ఉన్నవారు..ఈజి మనీ కోసం తాపత్రయ పడేవారు..కొంత మంది అమాయకులను ఈ దళారులు ఎంచుకొని వారికి డబ్బు ఆశ చూపించి తమ కార్యాకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఈ కుట్రలో అమాయకులైన సామాన్యులు చిక్కుకొని అల్లాడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటుంవంటి ఘటనలే వరుసగా తిరుపతి, అనంతపురం, రాజమండ్రిలో చోటు చేసుకోగా తాజాగా విశాఖలో లక్షలాది రూపాయల ఫేక్ కరెన్సీ పట్టుబడింది.

అయితే విశాఖపట్నంలో దొరికిపోయిన నిందితులు ఈ దొంగనోట్ల చలామణికి సంబంధించి అత్యంత కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు  ఎన్‌ఐఏ సైతం రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక పోలీసులను అప్రమత్తం చేసింది. అలాగే కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎఫ్‌సీఓఆర్‌డీ బృందం కూడా ఈ వ్యవహారంపై పరిశోధన ప్రారంబించినట్లు తెలిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: