సాధారణంగా రోడ్డుపై దిక్కూ మొక్కూలేకుండా ఎంతో మంది నిర్భాగ్యులు..ఆకలి కోసం అలమటిస్తుంటారు.  కన్నవారు కాదని పొమ్మంటే..చావలేక అన్నమో రామచంద్రా అంటూ అలమటించే వారు ఎంతో మంది ఉన్నారు.  అయితే కొంత మంద ఉదయం లేచిన మొదలు సొసైటీని బాగు చేయాలి..అనాదలను ఆదుకోవాలి..అలాంటి వారి మేం ముందుంటాం..అంటూ కోతలు కోసే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఓ ఉద్యోగి..ఆకలితో అలమటిస్తున్న ఓ ముసల్వకు నేనున్నానని భరోసా ఇచ్చాడు.
Image result for hyderabad traffic police
ఆహారాన్ని కూడా తినలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలికి ట్రాఫిక్ పోలీసు కొడుకయ్యాడు. రోడ్డు పక్కన దిక్కులేని స్థితిలో ఉన్న ఆ అభాగ్యురాలకి తన చేతులతోనే ఆహారం తినిపించాడు.  హైదరాబాద్ కుకట్ పల్లి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో పని చేసే హోం గార్డు బి.గోపాల్ కనబరచిన మానవత్వమిది ! గత మూడు రోజులుగా తిండి, నీళ్ళు లేక పస్తులతో గడుపుతున్న ఆ మహిళ కొంత మంది చూస్తూ వెళ్తున్నారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ కుకట్ పల్లి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో పని చేసే హోం గార్డు బి.గోపాల్ ఆ వృద్దురాలి  దీనావస్థ చూసి చలించిపోయారు.
Image result for hyderabad traffic police
ఆమెకు ఇంత రొట్టె ఇచ్చి తినమన్నాడు. కానీ తన చేతులతో స్వయంగా తీసుకొని తినలేని ఆమె పరిస్థితి చూసి తానే స్వయంగా తినిపించి మంచినీళ్లు తాపించాడు. ఆ దృశ్యాలను క్లిక్‌మనిపించిన నెటిజన్లు.. శభాష్ పోలీసంటూ.. ప్రశంసలు గుప్పింస్తున్నారు.  ‘మార్పు అంటే ఇదే. ఫ్రెండ్లీ పోలిసింగ్ మాత్రమే కాదు. ఇది సామాజిక బాధ్యత’ అంటూ ఒకరు కామెంట్ పెట్టారు.

మంచి మానవత్వం ఉన్న వ్యక్తంటూ నెటిజన్లు గోపాల్‌పై ప్రశంసలు గుప్పించారు. సైబరాబాద్ కమిషన్ వీసీ సజ్జనర్ కూడా ఆ హోంగార్డ్‌ను అభినందించారు. ఈ వైనం తెలిసి డీజీపీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హర్ష భార్గవి తన ట్విటర్ లో దీన్నిపోస్ట్ చేశారు. గోపాల్ చూపిన మానవతను హోం మంత్రి నాయిని నరసింహారెడ్డితో బాటు పోలీసు అధికారులంతా ప్రశంసించారు. ఆ అభాగ్యురాలిని ఓల్డ్ ఏజ్ ఆశ్రమానికి పంపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: