ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాటంలో జాతీయ స్థాయి పార్టీల మద్దతు కూడగడతారట.. అందుకోసమే ఢిల్లీ వస్తున్నారట. అంతవరకూ బాగానే ఉంది. కానీ చంద్రబాబు గత చరిత్ర తిరగేసిన వారికి ఆయన గతంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో పోషించిన పాత్ర ఏంటో అర్థమవుతుంది. యునైటెడ్ ఫ్రండ్ కాలంలో ఆయన చక్రం తిప్పిన విషయం గుర్తుకు వస్తోంది. 



అందుకే చంద్రబాబు వస్తున్నాడంటే చాలు మోడీ అండ్ టీమ్ భయపడిపోతోందని పసుపు సేనలు కామెంట్లు విసురుతున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఓ విచిత్రం చోటు చేసుకుంటోంది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు అండ్ ఆయన ఎంపీలు ఓ విషయాన్ని పదే పదే స్ట్రెస్ చేసి చెబుతున్నారు. 



మీడియా అడిగినా అడగకపోయినా ఆ మాట మళ్లీ మళ్లీ చెబుతున్నారు. చంద్రబాబు కూడా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా మరింత క్లారిటీగా చెబుతున్నారు. తాను ఢిల్లీ వచ్చింది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని.. కానీ ఆయన ఎందుకు అన్ని సార్లు అంత క్లియర్ గా చెబుతున్నారు. జాతీయ రాజకీయాలతో తనకు అస్సలు పని లేదని స్పెసిఫిక్ గా చెబుతున్నారు..?



ఇలా పక్కాగా క్లారిటీ ఇవ్వడానికి అసలైన కారణం మోడీయేనని ఢిల్లీ మీడియా వర్గాలు భావిస్తున్నాయి. తాను కేవలం ఏపీ కోసమే వచ్చానని.. మీకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఏమీ చేయడం లేదని ఆయన మోడీకి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నారన్నమాట. జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు వస్తున్నాడని ఎక్కడ మోడీ తనపై కోపం పెంచుకుంటారోనని చంద్రబాబు భయపడుతున్నట్టుగా ఉంది ఆయన ట్విట్టర్ ప్రకటన. 



మరింత సమాచారం తెలుసుకోండి: