టెక్నాలజీని వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబుది ప్రత్యేకమైన భాణీ.. ఆయన ఇప్పటికే పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆధార్ వినియోగాన్ని, బయెమెట్రిక్ టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ఆయన మరో కొత్త పథకం ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఆధార్ తరహాలో భూమికి కూడా భూధార్ కార్డులను ఏపీ సర్కారు ప్రవేశపెడుతోంది. 

Related image

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోని  గ్రీవెన్స్ సెల్ హాలులో భూసేవ’ పథకాన్ని చంద్రబాబు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మనిషికి ఆధార్ లానే భూమి గుర్తింపునకు భూధార్ 
ప్రతి భూకమతానికీ, పట్టణ ఆస్తులకు, పంచాయతీలో ఆస్తులకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఇందులో 11 అంకెల సంఖ్య ఉంటుంది. ఇందులో  తాత్కాలిక భూధార్, శాశ్వత భూధార్ అనే రెండు దశల్లో సంఖ్య కేటాయిస్తారు. 

Image result for bhudhar in ap

ఈ భూధార్ కార్డును రెవెన్యూ, పురపాలక, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, అటవీ శాఖలను అనుసంధానం  చేస్తారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరులో అమలు చేస్తున్నారు. భూమికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రత్యేకత. ఈ భూధార్ కార్డు ద్వారా భూయజమానులకు 20 సేవలు అందుబాటులోకి వస్తాయి. 

Image result for bhudhar in ap
మొత్తానికి భూధార్ కార్డు రెవెన్యూ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ మోసాలకు, రైతు భూ సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా ఉన్న ఈ భూధార్ కార్డు అమలులో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: