టీటీడీ ఛైర్మన్ గా చంద్రబాబు పుట్టా సుధాకర్ యాదవ్ ను ఇటీవల నామినేట్ చేశారు. అయితే ఆయన నియామకం వివాదాస్పదం అవుతోంది. ఆయన గతంలో క్రిస్టియన్ అన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఓ క్రిస్టియన్ ను తిరుపతి తిరుమల దేవస్థానం ఛైర్మన్ గా ఎలా నియమిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇవి గతంలోనూ చాలాసార్లు వచ్చాయి. 

Image result for putta sudhakar yadav ttd

ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ స్వయంగా వివరణ ఇచ్చారు. "నేను పుట్టు హిందువుని. నేను క్రిస్టియన్ మతస్థుడని వచ్చే విమర్శలు నిరాధారాలు" అని తిరుమల తిరుపతి దేవస్థానానికి  ఛైర్మన్ గా ఎంపిక అయిన  పుట్టా సుధాకర్ యాదవ్ మీడియా ముందుకొచ్చి చెప్పారు. విజయవాడ లో కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయలో ఈ మీడియా జరిగింది. 

Image result for putta sudhakar yadav ttd

నేను పక్కా హిందువుని.. ఒక తిరునాళ్ళలో ఎద్దుల పందెం కు మాత్రమే అక్కడికి వెళ్ళా.. అక్కడ కార్యకర్తలు ఫ్లెక్సీలు వేయించారు వాటిని ఆధారంగా కావాలని కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పుట్టా సుధాకర్ యాదవ్ వివరణ ఇచ్చారు. తన హయాంలో సామాన్య మనిషికి సైతం శ్రీవారి దర్శనం కలిగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Image result for putta sudhakar yadav ttd
 తొలిసారిగా యాదవులకి తితిదే బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. టీటీడీ బోర్డ్ మెంబెర్ గా ఎన్నో దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేశానని... స్వంత డబ్బులు 2 కోట్ల రూపాయాలు ఖర్చు చేసానని  పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. తనకు పదవి రావడం వెనుక మంత్రి యనమల హస్తం ఉందనడం సరికాదన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: