ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మించాలంటే..ఎన్నో నెలలు..సంవత్సరాలు పడుతుంది.  కానీ కూల్చడానికి క్షణాలు చాలు..ఈ మద్య పాత భవంతులు, బ్రిడ్జీలు పనికి రావని తేల్చేసిన తర్వాత వాటిని క్షణాల్లో కూల్చుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  అమెరికా లోని కెంటుకీలో 86 ఏండ్ల నాటి బ్రిడ్జిని క్షణాల్లో కూల్చి పారేశారు.

ఈ అరుదైన ఘటనను చూడటానికి ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. బ్రిడ్జి కూలిపోయే ఘటనను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో బ్రిడ్జి కూలిపోయే వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 1932 లో నిర్మించిన ఈ బ్రిడ్జీ ని కూల్చేశారు. సుమారు 1500 ఫీట్ల వరకు ఎవరినీ అనుమతించకుండా పక్కన ఉన్న మరో బ్రిడ్జిని కూడా మూసేసి మరీ ఈ బ్రిడ్జీ ని కూల్చేశారు. 
Twitter video is loading
ఈ బ్రిడ్జి కూలగానే దాని శకలాలన్నీ నీటిలో పడిపోయాయి. దీంతో సిబ్బంది 24 గంటలు శ్రమించి బ్రిడ్జి శకలాలను తొలగించారు. అయితే 86 ఏండ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జీ పాతబడి పోవడం తోనే దాని పక్కన మరో బ్రిడ్జీ ని నిర్మించిన అనంతరం దీనిని కూల్చినట్లు అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: