మే 12, కర్ణాటక రాష్ట్ర రాజ్యాభిషేకానికి ప్రజలు తీర్పు ఇచ్చే రోజు, ఎన్నికల రోజు అంటే ప్రజలు తమ నాయకత్వాన్ని నిర్ణయించుకుకునే రోజు. కురుక్షేత్రానికి దాదాపు ఒక నేల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెలంతా చతురంగ బలాలతో సమాయత్తమౌతుంటాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల బరిలో కాంగ్రెస్, బాజపా, జెడిఎస్ పక్షాలు తమతమ సేనావాహినులను నిలబెట్టి ఉన్న సమయంలో వారి సామర్ధ్యాలను గెలుపు అవకాశాలను ప్రమిఖ మీడియా ఇండియా టుడే - కార్వే తో కలసి సంయుక్తంగా జరగనున్న ఎన్నికల్లో ప్రతిబింబించబోయే ప్రజాభిప్రాయాన్ని తమ సశాస్త్రీయ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సంపాదించి ప్రజల ముందుంచారు. 
Image result for karnataka elections 2018 opinion poll
224 అసెంబ్లి నియోజక వర్గాల్లో జరగనున్న ఎన్నికల రణరంగమంతా మూడుగుర్రాల స్వారీగానే - ముక్కోణపు పోరాటంగానే కనిపిస్తుంది. పరిస్థితులను సమీక్షిస్తే యుద్ధం ఇద్దరు సమీప ప్రత్యర్ధుల మద్య చాలా గట్టి పోరాటమే జరగనున్నట్లు, మధ్యలో మూడవ పక్షం మాత్రం అత్యంత కీలక నిర్ణేతగా కిరీటధారణ పొందే పక్షాన్ని నిర్ణయించే స్థాయిలో ఉంటుందని అనిపిస్తుంది.
Image result for karnataka elections 2018 opinion poll of INdia Today - karvy

అభిప్రాయ సేకరణని సమీక్షించి చూస్తే ఈ క్రింది విషయాలే సారాంశం గా వస్తుంది.
*కాంగ్రెస్‌ మరోసారి అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం 
*కాంగ్రెస్‌కు 90-101 సీట్లు వచ్చే అవకాశం అధికారం పొందటానికి కావలసిన సీట్ల సంఖ్య 112.
*బీజేపీకి 78-86 సీట్లు వరకు వచ్చే అవకాశం
*జేడీఎస్‌ కు 34-43 సీట్లు స్వంతం చేసుకొని కింగ్-మేకరుగా మారే అవకాశం 
*ఇతరులు స్వలపంగా 4-7 సీట్లు మాత్రమే దక్కించుకోవచ్చు
*జోడుగుర్రాలు కాంగ్రెస్ బాజపా మద్య ఓట్ల అంతరం కూడా అతి స్వల్పం అంటే 2 శాతం
*సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా కోరేవారు 33 శాతం మాత్రమే. 
Image result for karnataka elections 2018 opinion poll
'ఓట్ల వాటా గాప్'  శాతం అతి తక్కువగా ఉన్నందున అత్యల్ప 'ఓట్ల స్వింగ్' జరిగినా అతి పెద్ద మార్పు తెచ్చే ప్రమాదం పొంచి ఉంది. అదే టఫ్-ఫైట్ గా మారబోతోంది. కాంగ్రెస్ కు 37% ఓట్ షేర్ ఉండగా, బాజపాకు అది 35%,  జేడీఎస్‌ కు 19%  తేడా అతి స్వల్పం 
Image result for karnataka elections 2018 opinion poll of INdia Today - karvy
అయితే గత 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 122సీట్లు, బాజపా 40సీట్లు, జెడిఎస్ 40సీట్లు కలిగి ఉన్నాయి. సర్వే ప్రకారం బాజపాబాగా పుంజుకుంది. రాజ్యాధికారం చిక్కించు కొని కాంగ్రెస్ కు ఝలక్ యివ్వాలనుకునే బిజెపి ఆశలపై కర్ణాటక నీళ్ళు జల్లుతుందా? కాంగ్రెస్ ముక్త భారత్ కోరికైనా బాజపా సాధించుకుంటుందా?  అనేవి  ఎన్నికల తరవాత,  అంటే మే 18 న తెలవలసిన అంశాలు.   
Image result for karnataka elections 2018 opinion poll of INdia Today - karvy 
*సర్వే లో పాల్గొన్న 45% మంది కాంగ్రెస్ కు రెండవ అవకాశం మాత్రమే యివ్వాలని కోరారు. 
*ప్రస్తుత ప్రభుత్వంలో 30% మంది మాత్రమే సంతోషంగా ఉన్నామన్నరు.
*40% మంది ప్రభుత్వం మొత్తం అవినీతితో కూరుకు పోయిందన్నారు.
*55% కురుబ జనాబా, 53% దళితులు కాంగ్రెస్ కు అనుకూలం
*65% ముస్లిములు కాంగ్రెస్ కు అనుకూలం
*36% బ్రహ్మణులు 37% లింగాయతులు బాజపా-కాంగ్రెస్ ఓట్లను సమానంగా పంచుకుంటాయి.
*ఒక్కళిగలు, లింగాయతులు, బ్రహ్మణులు కాంగ్రెస్ కు ఝలక్ యివ్వతగిన వాళ్ళు. ఎన్నికల్లో ఎలా ప్రవర్తిస్తారో ముందుగా ఊహించలేము. 
ఈ సర్వే జనవరిలో టివి 9 - సి ఓటర్ చేసిన సర్వేకి అతి దగ్గరగా ఉంది.
 Image result for karnataka elections 2018 opinion poll of INdia Today - karvy

మరింత సమాచారం తెలుసుకోండి: