విదేశాంగ విధానం, విఫణి చట్టాలు, విరోధి దేశాల ఆస్తుల స్వాదీన చట్టం లాంటివి పకడ్బంధీగా అమలు పరిస్తే ప్రపంచ దేశాల్లో  యుద్ధాలని నివారించవచ్చనేది విదేశాంగ నీతిలో ప్రాధమిక సూత్రం. ఏడు దశాబ్ధాల భారత విదేశాంగ నీతి అంతా పక్కదేశాలంటే భీతి, భయం తో నడిచింది. సమగ్రమైన చట్టాలున్నా నైతిక స్థైర్యం లేని ప్రభుత్వాల వలన భారత్ చైనాతో అణకువ ప్రదర్శించింది. కాని నరెంద్ర మోదీ ప్రధాని అయ్యాక  ఆ చట్టం  పదును ఎక్కిందనటానికి నిదర్శనం చైనా పత్రిక "గ్లోబల్ టయింస్" వార్తలే.   
Image result for enemy property act 2017
భారత్‌ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించి, ఉద్రిక్తత సృష్టించడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం, ఆపై మళ్ళీ కొన్ని రోజులకు ఇంకో చోట ఇదే పని, ఇదంతా చైనాకి వెన్నతో పెట్టిన విద్య అలవాటైన తతంగమే. మాతేసి శత్రువు అప్రమత్తంగా లేని వేళ చైనా సరిహద్దుల్లో చేసే అక్రమాలకు అంతులేదు. కొన్ని నెలల కిందట భారత భూటాన్ సరిహద్దులోని భారత భూభాగం డోక్లామ్‌ లో అక్రమంగా ప్రవేశించిన చైనా సైనికులు ఏకంగా మూడున్నర నెలల తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారు. 
Related image
అదెంతవరకు వెళ్ళిందంటే యుద్ధం అనివార్యం అనే స్థాయికి చేరి మన పొరుగు దేశాలే కాదు, ప్రపంచదేశాలన్నింటికి ఆందోళన కలిగించారు. అయితే ఈ విషయములో భారత నాయకత్వం కనబరచిన తెగువ, స్థిత ప్రజ్ఞత ఇంకా ప్రాప్త కాలజ్ఞత కారణంగా చైనా ఇక్కడ వెనకడుగు వేయటం దానికే అనివార్యమైంది. చైనా డోక్లామ్ వద్ద  రోడ్లు రహదారి నిర్మించేందుకు యత్నించగా భారత సైనిక దళాలు అడ్డుకున్నాయి. ఇప్పటికీ కూడా చైనాకే స్వంతమైన ధౌర్భ్యాగ్యపు "సలాం స్లైసింగ్" అంటే దొంగతనంగా భూకబ్జా చిలక్కొట్టుడు విధానంలో చేసేయ్యటం అన్నమాట. సరిహద్దుల్లో అక్కడక్కడ సైన్యం నియంత్రణలో కాస్త అలసత్వం ఉన్న సరిహద్దు ప్రాంతంలో దొంగచాటుగా చైనా కొన్నేసి మీటర్ల భారత భూభాగంలో దొంగదారులు నిర్మిస్తూనే ఉంది. చైనా దొంగతనంగా నిర్మించిన రహదార్లు, అక్రమంగా కట్టిన స్థావరాలు ఉప గ్రహ చిత్రాల్లో కూడా బయటపడ్డాయి. 
Image result for enemy property act 2017
విపరీతమైన సైనిక, ఆయుధ సమపత్తి, పాటవం కలిగి ఉన్న చైనా చాలా పెద్ద దేశం, పైగా సుసంపన్న, అణ్వస్త్రదేశం కావడంతో మిగతా పొరుగు దేశాలు చైనాను ఎదిరించ లేక పోతున్నాయి. వారి అసహాయతను అలుసుగా తీసుకుని డ్రాగన్ దేశం అంతర్జాతీయ రాజకీయ విధానాలు మరచి మరింత రెచ్చిపోతున్నది. గత ప్రభుత్వ హయాంలో చైనా అంటే కొంత భయపడటం వెనక్కు తగ్గటం లాంటి అలసత్వ ధోరణలు భారత్ ప్రదర్శించేది. 
Related image
ఇపుడు భారత నాయకత్వం, విదేశాంగ విధానంలో అనేక మార్పులు చేసి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఇలాంటి విషయాలను ఎదుర్కోవటంలో బాగా రాటుదేలింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం అమలులో తీసుకు వచ్చిన "విరోధి ఆస్తుల స్వాధీన చట్టం" చైనాకు వణుకు పుట్టిస్తున్న ఉదంతం. చైనా గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న మోడీ ప్రభుత్వం తెచ్చిన శత్రుదేశ ఆస్తుల స్వాదీన చట్టం  

Image result for enemy property act 2017

Image result for enemy property act 2017
ఇందుకు పెద్ద ఋజువు, దేశ విభజన అనంతరం పాక్‌ కు తరలివెళ్లిన వారి ఆస్తులను శత్రువు కు చెందిన ఆస్తులుగా గుర్తించారు. వీటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సౌలభ్యం ఈ చట్టం ద్వారా కలుగుతుంది. 
Image result for enemy property act 2017
అలాగే, 1962 చైనా యుద్ధం తరవాత భారత్ లోని చైనీయుల ప్రభుత్వ వ్యక్తిగత చర స్థిర ఆస్తులను కూడా ఈ పరిధిలోకి చేర్చారు. 49ఏళ్ల క్రితం రూపొందించిన ఈ చట్టానికి పదునుపెట్టి తాజాగా మరిన్ని సవరణలు తీసుకు వచ్చారు. ఐతే కొన్నేళ్లుగా భారత్‌ లో చైనా సంస్థల పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఒక వేళ భారత్‌ - చైనాల మధ్య సాయుధ పోరు, పరిమిత యుద్ధం తలెత్తితే భారత్‌ లో వాణిజ్యం నిర్వహిస్తున్న పలు చైనా సంస్థల ఆస్తులను ఈ చట్టం కింద నిర్ద్వందం గా భారత్‌ స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడింది. 
Related image
ఈమేరకు  చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ఈ మద్య ఒక కథనం ప్రచురితమైంది. చైనాకు చెందిన పలు మొబైల్‌ కంపెనీలు, కంప్యూటర్‌ పరిశ్రమలను భారత్‌లో విరివి గా యూనిట్లు నెల కొల్పాయి. భారత సమ్యుక్త పార్లమెంటరీ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం భారత దేశ విభజన అనంతరం పాకిస్థాన్ కు వెళ్లిపోయిన వారి ఆస్తుల సంఖ్య దాదాపు 9,280 వరకు ఉన్నాయి. వీటి ప్రస్తుత విలువ లక్ష కోట్లకు పై మాటే. కొన్ని కంపెనీలలో వీరు గతంలో కొనుగోలు చేసిన వాటాల విలువ తాజా లెక్కల ప్రకారం దాదాపు వేల కోట్లలో ఉంటుంది.
Related image
ఇప్పుడు చైనా దాదాపు 600 కంపనీలను భారత్ లో నిర్వహిస్తుంది. దాని పెట్టుబడులు $85 బిలియన్ లని తెలుస్తుంది. అందుకే భారత్ చైనా యుద్ధం అనేది సంభవించ బోదని విశ్లేషకుల వాదన. మోడీ విదేశాంగ విధానములో తెచ్చిన మార్పులు విరోధి దేశాలకు మరణ శాసనమనే అంటున్నారు.  
Related image
1962 చైనా యుద్ధం అనంతరం చైనాకు వెళ్లిపోయిన వారి ఆస్తుల సంఖ్య 150 అని కూడా అధికారులు గుర్తించారు. ఇవి ఎక్కువగా పశ్చిమ బంగా, అసోం, మేఘాలయా, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, డిల్లీ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే  భారత్‌ లోని చైనా ఆస్తుల పరిస్థితిపై గ్లోబల్‌ టైమ్స్‌ ఆన్ దోళన వ్యక్తం చేసింది. ఈ కథనం చైనాలో ఆందోళన కలిగించింది. 

Related image

ఒక ప్రక్క ఆకర్షనీయ పెట్టుబడుల విధానంలో చైనాని దాని వ్యాపారాన్ని స్వాగతాలతో ఉవ్విళ్ళూరిస్తూ, మరో ప్రక్క పదునెక్కించిన శత్రుదేశ ఆస్థుల స్వాదీన చట్టంతో సరిహద్దులవద్ద నిలువరించటం ఒక అద్భుత విదేశాంగ విధానం. ఒక ప్రక్క విఫణి వద్ద శత్రుదేశంతో నయగారం వయ్యారం ప్రదర్శిస్తూనే, మరో ప్రక్క సరిహద్దులలో తొడపాశం పెట్టే "గుప్తవంశ తొలి సముద్రానంతర విదేశీ వ్యాపారం నిర్వహించిన సముద్రగుప్తుని రాజనీతిని" ఉపయోగించుకోవటం ఎంతైనా హర్షనీయం. అందుకే నరెంద్ర మోడీ పాలన అంతర్గతంగా ఎలా ఉన్నా సరిహద్దు అవతల దెశాలకు గుండెదడే అంటున్నారు విశ్లేషకులు. 

Image result for shivering xinping after seeing modi

మరింత సమాచారం తెలుసుకోండి: