ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు ఇదో ఐఎస్ ఐ సర్టిఫికెట్ అయ్యింది. ఈ ర్యాంకులో మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఆంధ్రా, తెలంగాణ కొన్నేళ్లుగా చెప్పుకుంటున్నాయి. ఈ ర్యాంకుల పెట్టిన మొదట్లో దానికి ఎలా అప్లయ్ చేయాలి.. ఏ ఏ అంశాల ప్రాతిపదికన ర్యాంకులు ఇస్తారు.. అనే అంశాలపై సరైన అవగాహన లేని కారణంగా ర్యాంకు సాధనలో తెలంగాణ వెనుకబడింది. 

Image result for andhra vs telangana

అప్పట్లో మొదటి ర్యాంకు గుజరాత్, రెండో ర్యాంకు ఏపీ సాధించాయి. తెలంగాణ ఎక్కడో పది ర్యాంకుల తర్వాత ఉంది. ఆ తర్వాత ఏడాది సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రెండో ప్లేస్ లో ఉన్న ఏపీ, పది దాటిన తెలంగాణ రెండూ  సంయుక్తంగా ఫస్ట్ ప్లేసుకు వచ్చేశాయి. దీంతో మేం నెంబర్ వన్ అంటే మేం నెంబర్ వన్ అంటూ తెలుగు రాష్ట్రాలు ప్రచారం చేసుకోవడం ప్రారంభించాయి. 

Image result for andhra vs telangana
ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీటవుతోంది. పారిశ్రామిక అభివృద్ధి దిశగా తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తా చాటాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈ రెండు రాష్ట్రాలు  వందకు వంద మార్కులు సాధించాయి. అయితే ఈ సారి ఈ రెండు మాత్రమే కాదు..  హర్యానా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్ కూడా వందకు వంద మార్కులు తెచ్చుకున్నాయి. 

Image result for ease of doing business

అంటే ఫస్ట్ ప్లేస్ లో మొత్తం ఆరు రాష్ట్రాలు ఉన్నాయన్నమాట.  వరుసగా రెండో సారి ఈ ఘనత సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు  ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్.. తెలంగాణ మరో ఐదు రాష్ట్రాలతో కలిసి ఈ స్థానాన్ని పంచుకుందని వివరించారు. మొత్తం మీద దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ట్విట్టర్ లో స్పందించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: