తెలుగు దేశం పార్టీలో తనకు సముచితమైన గౌరవం దక్కడం లేదని..శనివారం వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి  చెప్పిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయనను కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై యలమంచిలి రవి  విలేకరులతో మాట్లాడుతూ టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. టీడీపీలో కొందరు మంత్రులు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు.. అవే నేను పార్టీ మారడానికి కారణం అని తెలిపారు. ఒక దశలో తాను టీడీపీలో ఉన్నానా లేదా అని బాధేసిందన్నారు.   అందుకే గౌరవం లేని టీడీపీలో ఉండకూడదని వైసీపీలో చేరుతున్నట్టు చెప్పారు. తనను ఉపయోగించుకుని, టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వ్యాఖ్యానించారు.
jagan praja sankalpa yatra enters krishna district.. yalamanchili ravi joined in party
తాను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వైసీపీలో పనిచేస్తానన్నారు. 2004, 2014లోనూ తన అవకాశాలకు గండికొట్టి భంగపడేలా చేశారని యలమంచలి రవి విమర్శించారు. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాం. వైఎస్‌ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’  అని యలమంచిలి రవి పేర్కొన్నారు.కార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీతో చేరినట్లు యలమంచిలి రవి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: