ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరు తెలియని వారు ఉంటారా.. ఉండే ప్రసక్తే లేదు.. ఆమె సృష్టించిన సంచలనం అలాంటిది మరి. అలాగే కత్తి మహేశ్.. ఈ పేరు కూడా తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితంగా మారింది. ఈ ఇధ్దరూ ఇటీవల టీవీ న్యూస్ రూముల్లో కూర్చుని గంటలకు గంటలు డిస్కషన్లు నడిపించేస్తున్నారు. ఇక చాలు బాబో అనిపించేలా ఊదరగొడుతున్నారు. 

Image result for SRIREDDY KATHI MAHESH

మరి వీరు ఇంతగా ఎలా ఫేమస్ అయ్యారు. వీరి సక్సస్ సూత్రం ఏంటి.. ఇది చాలా సింపుల్.. పవన్ కల్యాణ్ వంటి సెలబ్రెటీలపై ఆరోపణలు చేయడమే.. కత్తి మహేశ్ కేవలం పవన్ కల్యాణ్ పైనా, ఆయన అభిమానులపైనా పదే పదే విరుచుకుపడటం వల్లే మీడియా హైలెట్ చేసింది. ఆ తర్వాత శ్రీ శక్తి ముందు సినిమా వాళ్ల కాస్ట్ కౌచింగ్ తో మొదలుపెట్టి లేటెస్ట్ గా పవన్ కల్యాణ్ ను మాద... ద్.. అని తిట్టేదాకా వెళ్లింది. 

Image result for SRIREDDY KATHI MAHESH

సో.. పాపులర్ కావాలంటే.. ముందు సెలబ్రెటీలను తిట్టాలి. అందులోనూ పవన్ కల్యాణ్ వంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రెటీ అయితే ఇంకా మంచిదన్నమాట. మరి ఇప్పుడు ఇదే సక్సస్ ఫార్ములా ఇంకా ఎంతమంది అనుసరిస్తారో.. అయితే కేవలం సెలబ్రెటీలను తిడితే సరిపోదు. ఆ సమాచారం టీవీ9 వంటి కలహభోజన న్యూస్ ఛానళ్లకు అందిచాలి. అప్పుడే పాపులర్ అవుతారు ఎవరైనా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: