మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలముందు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎన్.టీ. రామారావు రాజకీయాలలో సృష్టించిన చరిత్రను తిరగ రాస్తాడు అని మెగా స్టార్ అభిమానులు ఆశించారు. అయితే ఎన్నికల రానా రంగంలో చిరంజీవిని అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఓట్లు తిరస్కరించినా తనదైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ చెంతన చేరి కేంద్రమంత్రి స్థానానికి చేరుకున్నాడు. 
CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఆతరువాత ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందడంతో రాజకీయాలకు స్వస్తి పలికి తిరిగి సినిమాల వైపు టర్న్ అయిన మెగాస్టార్ ను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పిలిపించుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా మోడీ కి చెక్ పెట్టాలి అని వ్యూహాలు రచిస్తున్న రాహుల్ చిరంజీవిని ఢిల్లీ పిలిపించుకుని ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోఒక కీలక పదవి ఇస్తాను అని ఆఫర్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.   
CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే చిరంజీవి మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించడమే కాకుండా   ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు మాత్రమే అనిరాహుల్ కు  స్పష్టం చేసినట్లు టాక్.  దీనికితోడు గత కొంతకాలంగా ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా ఉద్యమ విషయంలో కూడ దూరంగా ఉంటున్న చిరంజీవి అదే పద్దతిని కొనసాగిస్తూ రాజకీయాలకు మరింత దూరం జరగాలి అన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈవార్తలపై కొందరు రాజకీయ విశ్లేషకులు మరో అభిప్రాయాలన్ని వ్యక్త పరుస్తున్నారు. 
chirangeevi along with pavan latest photos కోసం చిత్ర ఫలితం
ఈ మధ్యకాలంలో పవన్ చిరంజీవిల మధ్య  ప్రేమానురాగాలు బాగాపెరిగిన నేపధ్యంలో రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ కు సపోర్ట్ గా తెర వెనుక రాజకీయాలు నడిపే ఉద్దేశ్యంతో చిరంజీవి రాహుల్ మాటలను తిరస్కరించాడు అని అంటున్నారు. మరికొందరు అయితే మెగా ఫ్యామిలి సన్నిహితులు కొంతమంది ఇలాంటి న్యూస్ ను ప్రచారంలోకి తీసుకువచ్చి ఇప్పటికీ చిరంజీవి ఒక బలమైన రాజకీయ శక్తీ అని అందరికే గుర్తుకు చేసే విధంగా ఈవార్తను పొలిటికల్ సిర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారడానికి ఇలాంటి లీకులు సృట్టిస్తున్నారు అని టాక్. మరికొందరు అయితే  చిరంజీవి తన రాజ్యసభ్యత ముగిపురోజున కూడ రాజ్యసభకు వెళ్ళని నేపధ్యంలో రాహుల్ గాంధీకి చిరంజీవి ఎందుకు గతుకు వస్తాడు అని సెటైర్లు వేస్తున్నారు..
 



మరింత సమాచారం తెలుసుకోండి: