తెలుగు సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ సినీరంగం పెద్దలెవరూ దీనిపై స్పందించకపోగా.. తాజాగా సినీ నటి జీవితరాజశేఖర్ తెర ముందుకు రావడంతో కొత్త అంశాలపై చర్చ మొదలవుతోంది. జీవిత రాజశేఖర్ పై టివీ చర్చలలో ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ఆమె మీడియా ముందు ఘాటుగా స్పందించారు. అయితే ఆమె స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 


సినిమా పరిశ్రమలో తప్పు జరగడం లేదని నేనడం లేదు. శ్రమ దోపిడి అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. దళారి వ్యవస్థ అన్ని రంగాల్లోనూ ఉంది. జీవితారాజశేఖర్‌ ఎప్పటికీ జీవితా రాజశేఖరే! సినిమా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడటం ఏమైనా తమాషానా! డిబేట్లు పెట్టి సినిమా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని జీవిత రాజశేఖర్ మీడియాతో అన్నారు. 

Image result for jeevitha rajasekhar CASTING COUCH
అయితే మోసపోతున్నామంటున్న హీరోయిన్లకు తాము మోసపోతున్నామని తెలియదా అంటూ జీవిత ఎదురు దాడి చేయడం.. తప్పు జరగడం లేదని నేను చెప్పడం లేదని అనడం సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకున్నట్టే అవుతుంది. పైగా అది పెద్ద తప్పేమీ కాదన్నట్టు ఆమె మాట్లాడటం వివాదాస్పదమవుతోంది. అంతే కాదు.. మీరేమైనా చిన్న పిల్లలా మీరు ఎక్కడికి వచ్చారో మీకు తెలియదా అంటూ జీవిత హీరోయిన్లను ప్రశ్నించారు. 


సినీపరిశ్రమకు వచ్చేటప్పుడు అన్నీ తెలుసుకుని రావాలన్నట్టు జీవితరాజశేఖర్ మాట్లాడటం కూడా విమర్శలపాలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికైనా చిత్ర పరిశ్రమలోని పెద్దలంతా వచ్చి దీనిపై మాట్లాడాలని జీవిత చెప్పడం విశేషం. అది కూడా మంచిదే. ఎక్కువ మంది మాట్లాడితే మరిన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఏమంటారు..!?



మరింత సమాచారం తెలుసుకోండి: