ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్మపోరాట దీక్షకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల నుండి విపరీతమైన స్పందన వస్తూ ఉంటే ఈపోరాట దీక్షను విమర్శిస్తూ అనేకమంది ప్రముఖులు చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య కాలంలో మీడియాకు దూరంగా ఉంటున్న కృష్ణంరాజు చద్రబాబును టార్గెట్ చేస్తూ నిప్పులు కురిపించే విధంగా కామెంట్ చేయడం ఈరోజు హాట్ టాపిక్. 
 175 నియోజకవర్గాల్లో దీక్షలు, ర్యాలీలు
చంద్రబాబు నేడు చేసిన ఒక్కరోజు నిరాహార దీక్ష వల్ల ఆంధ్రప్రదేశ్ కు కాని అక్కడ ప్రజలకు కానీ వచ్చే ప్రయోజనం ఏముంది అంటూ ఎదురు ప్రశ్నలు వేసాడు కృష్ణంరాజు. ఆంధ్రప్రదేశ్ జీడీపీ 11 శాతం ఉందని చంద్రబాబు చెపుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంత అభివృద్ధి ఉన్న ఆంధ్రప్రదేశ్  2.34 లక్షల కోట్ల అప్పుల్లో ఎందుకు కూరుకుపోయింది అని ప్రశ్నలు వేస్తున్నాడు రెబల్ స్టార్. 
మోడీ-జగన్ మధ్య విజయసాయి దూతగా
చంద్రబాబు పాలనలో ప్రజలకు పెరిగిన అప్పులు తప్ప మరేమీ లేవు అంటూ చంద్రబాబును టార్గెట్ చేసాడు కృష్ణంరాజు. అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబును అభినంధించి జగన్ అందరికీ షాక్ ఇచ్చాడు. మరికొందరు ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు చంద్రబాబు దీక్ష ఒక ఈవెంట్ లా కనిపిస్తోంది అంటూ ఈ దీక్ష కోసం కోట్లాది రూపాయాలు ప్రజాధనం దుర్వినియోగం చేసారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు కురిపిస్తున్నారు. 
 మోడీని తిడుతూ, శివప్రసాద్ ఆరు వేషాలు
అయితే ఈరోజు ఉదయం ఈ దీక్ష కార్యక్రమ వేదిక నుండి ప్రసంగించిన నందమూరి సింహం బాలకృష్ణ ఏకంగా నరేంద్ర మోడీ ని టార్గెట్ చేస్తూ ఘాటైన సెటైర్లు వేయడమే కాకుండా ప్రత్యేక హోదా విషయమై కొద్దిసేపు నినాదాలు చేయడంతో బాలకృష్ణ హడావిడి మీడియా కెమెరాలకు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న జగన్ మరో ఒకటి రెండు రోజులలో బాబు ధర్మ పోరాట దీక్షకు చెక్ పెట్టే విధంగా అనుసరించబోయే కొత్త వ్యూహాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: