కేంద్ర ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలపాటు అధికారాన్ని పంచుకుని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కు బిజేపి అన్యాయం చేస్తోంది అంటూ ఎన్ డి ఎ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నిన్న చేసిన ‘ధర్మ పోరాట’ దీక్ష సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామాన్ని చూసి భారతీయ జనతాపార్టీ వర్గాలు కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 
CHANDRABABU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విభజన చట్టం హామీల సాధన కోసం నిన్న దీక్ష చేసిన చంద్రబాబుకు తన పుట్టినరోజు సందర్భంగా ఒక అత్యంత ప్రముఖ వ్యక్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి.  దీనితో మోడీ చంద్రబాబుల మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తుందా అనే సందేహాలు కొందరికి కలిగాయి. 
NARENDRA MODI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తన పుట్టినరోజు సందర్భంగా దీక్ష చేస్తున్న చంద్రబాబును అభినందిస్తూ ప్రధానమంత్రి మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. మోడీ ట్విట్టర్ ద్వారా బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయురారోగ్యాలతో టీడీపీ అధినేత వర్ధిల్లాలని మోడీ ఆకాంక్షించారు. అయితే ఈ ట్వీట్ కు చంద్రబాబు ఆసక్తికర రిప్లై ఇచ్చారు. `జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడే నా ధర్మపోరాట దీక్షను విరమించాను. ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈదీక్షను చేపట్టాను` అంటూ స్పందించారు.
CHANDRABABU ALONG WITH MODI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో చంద్రబాబుకు మోడీ శుభాకాంక్షలు తెలియచేయడం దానికి ప్రతిగా చంద్రబాబు వ్యూహాత్మకంగా స్పందించడంకు సంబంధించిన వార్తలను  తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ వర్గాలు షాక్ అయినట్లు సమాచారం. రాజకీయాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు కాబట్టి వచ్చే ఎన్నికల తరువాత వీరిద్దరూ తిరిగి కలిసిపోయినా ఆశ్చర్యం లేదనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: