టీవీ9 రవిప్రకాశ్, తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన వాడు.. తేజా టీవీతో టీవీ మీడియా జర్నలిజం మొదలుపెట్టి.. టీవీ9తో దాన్ని కొత్త దారులు పట్టించాడు. నిజంగా టీవీ9.. అందులో రవిప్రకాశ్ స్టోరీలు, ప్రజంటేషన్ అప్పట్లో ఓ సంచలనం.. ఆయన్ను చూసి.. ఆయనలా పేరు తెచ్చుకోవాలని మీడియా రంగంలో ఎందరో కుర్రాళ్లు అడుగుపెట్టారు కూడా. 

ravi praksh tv9 కోసం చిత్ర ఫలితం

టీవీ9 ద్వారా కొన్ని సామాజిక దురాచారాలపైనా రవిప్రకాశ్ ధ్వజమెత్తుతారు. మెరుగైన సమాజం కోసం.. ఇదీ టీవీ9 ట్యాగ్ లైన్. అలాగే కట్నం తీసుకునేవాడు గాడిద, జ్యోతిష్యం ఓ మూఢనమ్మకం అంటూ ప్రచారం చేస్తుంటారు కూడా. అలాంటి రవిప్రకాశ్ లోని ఓ కొత్త కోణాన్ని బయటపెట్టారు పవన్ కల్యాణ్.. శ్రీరెడ్డి ఉదంతం తర్వాత రవిప్రకాశ్ పై దుమ్మెత్తిపోస్తున్న పవన్ ఆయనపై యుద్ధమే చేస్తున్నారు. 


ఈ యుద్ధంలో భాగంగా పవన్ కల్యాణ్ ఓ యజ్ఞంలో పాల్గొన్న ఫోటోను పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. రవీ మీకు ఇలాంటి పూజల్లో కూడా నమ్మకముందా.. అంటూ కామెంట్ కూడా పెట్టారు. అయితే ఈ ఫోటో మరీ అంత కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ ఇది నెట్టింట్లో చక్కర్లు కొట్టిందే... కాకపోతే ఇప్పుడు పవన్ యుద్ధం ప్రారంభించారు కాబట్టి ఆయనకు కొత్త అనుకోవాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: