ఈ మద్య సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి కొన్ని అనర్థాలు జరిగితే..మరికొన్ని జీవితాలు బాగుచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ముఖ్యంగా సెలబ్రెటీల విషయం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక సోషల్ మాద్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త స్నేహ సంబధాలు..బంధువులతో చిట్ చాట్,వీడియో చాట్ లు ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. తాజాగా వాట్సాప్ ద్వారా ఒక జంట ప్రేమలో పడటమే కాదు పెళ్లి కూడా చేసుకున్నారు. 

ఇందులో ఏంటీ ప్రత్యేకత అంటారా..అసలు విషయానికి వస్తే..వారిద్దరికీ మాటలు రావు, చెవులు వినిపించవు. అయినా ఇద్దరినీ వాట్సప్‌ ద్వారా చాటింగ్‌తో పరిచయం మొగ్గతొడిగి అది ఇరు హృదయాల మధ్య ప్రేమగా మారింది. వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు.  బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయ భవనంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో మూగబధిరులైన అశ్విని, ఈశ్వర్‌లు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ఈశ్వర్, అశ్వినీ ఇద్దరూ వేర్వేరు జిల్లాలకు చెందిన వారు,  పుట్టుకతోనే దివ్యాంగులు.
Image result for whatsapp love
  చిన్న నాటి నుంచి ఇతరు పిల్లల మాదిరిగా పాఠశాలల్లో చదువుకోవాలన్న వారి జిజ్ఞాస తల్లిదండ్రులు అర్థం చేసుకొని ఎలాగో అలా కష్టపడి చదివించారు. ప్రస్తుతం ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.   వీరిద్దరికీ గతంలో ఎలాంటి పరిచయం లేదు. వాట్సప్‌ ద్వారా పరిచయమై ప్రేమగా మారింది.
Image result for whatsapp l
రాయచూరు జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తిప్పణ్ణ, మంజుల కుమారుడు ఈశ్వర్‌. బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సు డ్రైవర్‌ తిప్పేస్వామి, రత్నమ్మ దంపతులకు కలిగిన అశ్వినీ కూడా పుట్టుకతోనే మూగ.  వాట్సాప్ లో వీరిద్దరూ పరిచయం కావడం..ఇద్దరూ తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలిపి పెళ్లికి ఒప్పించారు. బంధుమిత్రుల నడుమ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: