ప‌వ‌న్‌కు, తెలుగులోని కొన్ని టీవీ ఛానెళ్ల‌కు మ‌ధ్య తీవ్ర‌మైన పోరు జ‌రుగుతోంది. టీవీ-9, ఏబీఎన్‌, టీవీ-5 వంటి వాటిని బ‌హిష్క‌రించాల‌ని ప‌వ‌న్ నాలుగు రోజుల కింద పిలుపునిచ్చాడు. త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు కొన్ని ఛానెళ్లు కంక‌ణం క‌ట్టుకున్నాయ‌ని ఆరోపించిన ప‌వ‌న్‌.. వాటిపై తీవ్ర స్థాయిలోనే యుద్ధం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలోనే తాను యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నాన‌ని, త‌న ప్రాణాలు పోయినా లెక్క‌చేయ‌న‌ని పెద్ద ఎత్తున డైలాగులు పేల్చాడు. మ‌రి ఈ క్ర‌మంలో ప‌వ‌న్  ఎఫెక్ట్ ఎంత మేర‌కు ఆయా చానెళ్ల‌పై ప‌డుతుంద‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ ప్రారంభ‌మైంది. నిజానికి తాను టీడీపీకి రాంరాం చెప్పిన త‌ర్వాత నుంచి చంద్ర‌బాబు అనుకూల మీడియా త‌న‌ను టార్గెట్ చేస్తూవ‌స్తోంద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చాడు. 

Image result for pawan kalyan film chamber

అలాంటి టీవీ ఛానెళ్ల‌పై సుదీర్ఘ న్యాయపోరాటం చేయబోతున్నానని  త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించాడు కూడా. ఇలా ప్రకటించిన విధంగానే ఏబీఎన్ - టీవీ9 - టీవీ5లపై ట్విట్టర్లో పవన్ ఓ మినీ యుద్ధమే చేస్తున్నారు. ఆ చానెళ్లపై - వాటి అధిపతులు - సీఈవోలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ప్రతిరోజు వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా ఆ మూడు చానెళ్లను బాయ్ కాట్ చేయాలని కూడా తన అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు.
తమ తల్లులను - చెల్లెళ్లను కించపరిచే కార్యక్రమాలు ప్రసారం చేసే ఆ ఛానెళ్లను చూడవద్దంటూ అభిమానులనుద్దేశించి ట్వీట్ చేశారు.

అయితే పవన్ పిలపును అభిమానులు అందుకున్నారా....పవన్ పిలుపు ప్రభావం ఆ ఛానెళ్లపై పడిందా లేదా అన్నాది ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తున్న విష‌యం. వారానికోసారి టెలివిజన్ ఛానెళ్ల టీఆర్పీ రేటింగులను బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకటిస్తుంది. యథా ప్రకారం రేపు గురువారం నాడు గత వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగులు వెలువడనున్నాయి. దీంతో పవన్ పిలుపు ప్రకారం .... ఆ ఛానెళ్లను వీక్షించేవారి సంఖ్య తగ్గిందా? లేదా? అన్నది తేలిపోనుంది. 


పవన్ అభిమానులు ఆ ఛానెళ్లను బాయ్ కాట్ చేస్తే....వాటి టీఆర్పీలు ఒక్కసారిగా పడిపోతాయా అన్న విషయం పై కూడా స్పష్టత రానుంది. దీంతో రేపు వెలువడబోతోన్న టీఆర్పీ రేటింగుల కోసం ఆ ఛానెళ్ల యాజమాన్యాలతోపాటు పవన్ అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.  ఇదిలావుంటే, టీవీ ఛానెళ్ల‌ను బ‌హిష్క‌రించాల‌ని, ఏ కార్య‌క్ర‌మానికీ కూడా వాటికి ఆహ్వానం పంప‌రాద‌ని, ఇంట‌ర్య్వూలు ఇవ్వ‌రాద‌ని టాలీవుడ్ హీరోలు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. మ‌రి ఈ నిర్ణ‌యం ప్ర‌భావం బుల్లితెర ఇండ‌స్ట్రీపై ఎంత‌మేర‌కు ఉంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: