సరైన సమయంలో తగిన టైం ఫ్రేం లో రైతుకూలీలకు పునరావాసం కలిపించనందుకు ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తన అసంతృప్తిని వ్యక్తపరచింది. ప్రజలవెతలు మీకు కనిపించవా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వ్యవసాయ కూలీలకు పునరావాసం కలిపించే విషయంలో ఎగవేత ధోరణి అవలబిస్తూ ఉందని ఆ తప్పు ప్రభుత్వం ఒప్పుకోవాలని నిర్దేశించింది. వందలాది గ్రామాలలో భూసేకరణ జరిపి అమాయకపు నిరుపేద వ్యవసాయకూలీలకు సరైన పునరావాసం కలిపించటం వెంటనే జరగాలని ఆదేశించింది. లేకుంటే న్యాయస్థానం సూక్ష్మ సందర్శనం చేయటానికి సిద్దమౌతుందని తీక్షణంగానే హెచ్చరించింది. 
ap high court కోసం చిత్ర ఫలితం  
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నిన్న (30.04.2018 సోమవారం) హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. రైతు కూలీలకు పునరావసం కల్పించే విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 600ప్రాంతాల్లో భూసేకరణ విషయంలో 448చోట్ల రైతు‌కూలీలు లేరన్న ఆంధ్ర ప్రదెశ్ ప్రభుత్వ వాదనలను హైకోర్ట్ తప్పుపట్టింది. "డోర్ టూ డోర్ సర్వే" నిర్వహించారా? లేదా?  అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. హైకోర్ట్ సూక్ష్మ పరిశీలన చేస్తుందని ప్రభుత్వానికి తెలిపింది.


వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక్క అవకాశమిచ్చింది. బుధవారం అంటే 02.05.2018న సమగ్ర వివరాలతో మాత్రమే కోర్టుకు రావాలని ఆదేశింది. పూర్తి నిజాలు లేని పక్షంలో రాష్ట్ర మంతటా "భూసేకరణపై స్టే" విధిస్తామని హెచ్చరికలు చేసింది. 


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు భూసేకరణ ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని హైకోర్టు ను గతంలో ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఆ సందర్భంగా జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయ లక్ష్మి తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి స్రీనివాస్ను ద్వారా రాష్ట్రప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది.    

dammalapati srinivasa advocate general ap కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: