వచ్చే ఎన్నికల్లో గట్టేకేందుకు కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొనేలా వ్యూహరచన చేస్తోంది. ఒకపక్క అధికార పార్టీ వైఫల్యాలను ఎండకడుతూ, మరోపక్క తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల విధివిధానాలపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ పాలనలో విసిగిపోయిన అసంతృప్త వర్గాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టింది. 2014 ఎన్నికల్లో, అంతకుముందు ఉద్యమ సమయంలో వివిధ వర్గాలకు టీఆర్ ఎస్ అనేక హామీలు గుప్పించింది. 

Image result for telangana

గత నాలుగేళ్ళ పాలనలో టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆయా వర్గాలు అసంతృప్తితో ఉన్నట్లు కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పుడు వాళ్ళందరినీ తమవైపు తిప్పుకునే పనిలో పడింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల వారిగా టీఆర్ ఎస్ హామీలు ఇచ్చి నెరవేర్చని విషయాన్ని, వివిధ వర్గాలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను సైతం తెలుసుకొంటుంది. ఆయా వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తమకు ఏమి కావాలనుకుంటున్నాయో తెలుసుకొని హైకమాండ్ దృష్టికి తీసుకపోనున్నారు. వీరితో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తదితర వర్గాలపై కూడా దృష్టి సారించారు. 

Image result for trs

ఇందులో భాగంగా ఆయా వర్గాలకు చెందిన మేధావులతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ నేతృత్వంలో ఓబీసీ మేధావులతో సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా తమ అభిప్రాయాలను వెల్లడించగలిగిన బీసీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్‌లు, విద్యార్థి నాయకులు, మేధావులను ఆహ్వానించి వారి అభిప్రాయాలను సేకరించారు. వీటన్నింటిని క్రోడీకరించి వాటిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళనున్నారు. 

Image result for దాసోజు శ్రవణ్

హైకమాండ్ ఆదేశంతో ఆయా వర్గాల ఆకాంక్షలను మానిఫెస్టోలో పొందుపర్చనున్నట్లు సమాచారం. అంతేకాక పార్టీలకు అతీతంగా ఉన్న తటస్థ వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకొనే పనిలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు. స్పష్టంగా తెలుసుకోవచ్చని కాంగ్రెస్‌ నేతలు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. మరోపక్క బలమైన బీసీ వర్గాన్ని తలవైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: