జాతీయ స్థాయి క్రీడాకారిణి అయిన మౌప్రియ మిత్రా ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిత్రా హూగ్లీ జిల్లాలోని బాండేల్ మనస్పూర్‌లో కల తన నివాసంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిలేషన్‌షిప్‌ వివాదాలతో ఆమె ఒత్తిడికి గురైందని తాము గుర్తించామన్నారు.

ఆమె వయస్సు 15 సంవత్సరాలు. కొలంబోలో 2016లో జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఆక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఈత పోటీల్లో మౌప్రియ ఒక బంగారు పతకాన్ని, ఒక రజత పతకాన్ని గెలుచుకుంది. ఈత కొట్టడంలో ప్రత్యేకత సాధించింది.  దీనిపై మరింత విచారణ చేపడుతున్నామని బాండేల్‌కు చెందిన పోలీసాఫీసర్‌ వివరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
Image result for మౌప్రియ మిత్రా
మౌప్రియ ఇంటిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకకపోవడంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మౌ మిత్రా పదో తరగతి చదువుతుండగానే జిమ్నాస్టిక్స్‌గా తన కెరీర్‌ ప్రారంభించింది. కొన్నాళ్ల తర్వాత అనుకోని ప్రమాదం సంభవించడంతో తన కాలుకి గాయం అయింది. అప్పటి నుంచి ఆమె స్విమ్మింగ్‌పై పట్టు సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: