తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.   చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉండగా ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు ‘రాక్షసుడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.  తర్వాత నిర్మాణ రంగం వైపు వెల్లిన నాగబాబు ప్రస్తుతం ‘జబర్ధస్త్’ కామెడీ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  పలు చిత్రాల్లో నటిస్తూనే..జబర్ధస్త్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ఇక చిరంజీవి చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి..ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లో కూడా తనదైన సత్తా చాటుతున్నాడు.
Image result for jabardasth nagababu
 సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించినా..అప్పుడు పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కి మద్దతు పలికిన పవన్ కళ్యాన్ ప్రస్తుతం ఆ రెండు పార్టీలతో విభేదించి..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దం అయ్యారు.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పార్టీ కార్యాచరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  అయితే జనసేన పార్టీలో కీలక సభ్యులను ఎన్నుకొని వారినే పోటీలో నిలబెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు పవన్ కళ్యాన్. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు నాగబాబును జనసేన పార్టీ తరుపు నుంచి పోటీ చేయించే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 
Image result for megabrother
తాజాగా దీనిపై స్పందించిన నాగబాబు..ఇండస్ట్రీలో సమస్య తలెత్తినప్పుడు మెగా హీరోలు స్పందించలేదు అనే వార్తల్లో నిజం లేదని... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించినప్పుడు వ్యక్తిగతంగా తాము జోక్యం చేసుకోవడం ఎందుకనే భావనతో ఉన్నామని నాగబాబు చెప్పారు. మెగా అభిమానుల అభిమానానికి కొలమానం ఉండదని..తమ పరిధిలో ఉన్నవారిని మాత్రమే నియంత్రించగలమని, లక్షలాది మంది అభిమానుల్లో ఎవరో ఒకరు తప్పు చేస్తే, దానికి తమను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు.
Related image
ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, ఎవరు ఎలా స్పందిస్తారో తమకెలా తెలుస్తుందని ప్రశ్నించారు.జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదని నాగబాబు అన్నారు. అసలు ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: