తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిని రేపుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నేత‌ల క‌ద‌లిక‌లు.. ప‌లువురు నాయ‌కులు చాటుమాటు మంత‌నాలు ఆస‌క్తిని రేపుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ నేత‌, మంత్రి హ‌రీశ్‌రావుపైనే అంద‌రి దృష్టి. ఆయ‌న ఏం చేస్తున్నారు..? ఏ స‌మావేశంలో ఏం మాట్లాడుతున్నారు..? ఎవ‌రిని క‌లుస్తున్నారు..?  పార్టీలో నెల‌కొన్న ఆధిప‌త్య పోరుతో ఆయ‌న ముందుముందు ఏం చేయ‌బోతున్నారు..?  న‌లుగురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌లిసిన చోట ఇవే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. స‌మాధానం లేకున్నా వాటిని తిప్పితిప్పి వేస్తూ గంట‌ల‌కొద్దీ.. రోజులు.. నెల‌లు, సంవ‌త్స‌రాలు మంత్రి హ‌రీశ్ క‌ద‌లిక‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. 

Image result for Nitin Gadkari harish rao

ఈ క్ర‌మంలోనే ఈనెల 5న హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కేంద్ర‌మంత్రి నితిన్‌గ‌డ్క‌రీని మంత్రి హ‌రీశ్‌రావు చాటుగా క‌లిసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక్క‌డే ఎన్నో ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వ‌హించిన‌, ఆ త‌ర్వాత దాని నుంచి త‌ప్పుకున్న‌ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త సీఎల్ రాజం నూత‌న ప‌త్రిక విజ‌య‌క్రాంతిని ప్ర‌జ‌ల‌ముంద‌కు తెచ్చారు. ఈనెల 5న హోట‌ల్ మారియ‌ట్‌లో ఈ ప‌త్రిక ప్రారంభోత్స‌వానికి కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వ‌చ్చారు. 

Image result for nitin gadkari

ఇక్క‌డ మ‌రోవిష‌యం ఏమిటంటే... ప‌త్రిక ప్రారంభోత్స‌వానికి టీఆర్ఎస్ మిన‌హా అన్నిపార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ ప‌త్రిక‌ను టీఆర్ఎస్‌కు ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా తీసుకొస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే హోట‌ల్ మారియ‌ట్‌లో విజ‌య‌క్రాంతి ప‌త్రిక ప్రారంభోత్స‌వం ముగిసే స‌మ‌యానికి మంత్రి హ‌రీశ్‌రావు అక్క‌డికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. హోట‌ల్‌లో మీడియా అంతా ఉండ‌డ‌డంతో.. హ‌రీశ్ లోప‌లికి రాకుండా హోట‌ల్ బ‌య‌టి నుంచే వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం. 

Image result for Nitin Gadkari harish rao

ప‌త్రిక ప్రారంభోత్స‌వం త‌ర్వాత పార్టీ కార్యాల‌యానికి వెళ్లిన నితిన్ గ‌డ్క‌రీ పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశంలో పాల్గొనాల్సి ఉన్నా. అర్థంత‌రంగా అక్క‌డి నుంచి మ‌ళ్లీ హోట‌ల్‌మ‌రియ‌ట్ వ‌చ్చారు. ఇక్క‌డే గ‌డ్క‌రీని మంత్రి హ‌రీశ్‌రావు క‌లిసిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా ఆ త‌ర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో జ‌రుగుతున్న ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో రామ‌దూత స్వామిని గ‌డ్క‌రీ క‌లిసి ఆశీస్సులు పొందారు. మంత్రి హ‌రీశ్ ఇక్క‌డ కూడా గ‌డ్కరీని మ‌రోసారి క‌లిసిన‌ట్లు తెలిసింది. మంత్రి హోదాలో గ‌డ్క‌రీని క‌లిసే అవ‌కాశం ఉన్నా.. హ‌రీశ్ ఎందుకుచాటుగా క‌లిశార‌న్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌.


మరింత సమాచారం తెలుసుకోండి: