భారతీయ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎవరికీ ఏమాత్రం అర్థంకాని వ్యక్తిత్వం. "నేను మోనార్క్ ను. నన్ను ఎవరూ మోసం చేయలేరు" అని సినిమాలో చెబుతుంటాడు. ఎన్ని మోసాలు జరుగుతున్నా తనకు తెలియవు అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు సినిమాలోని పాత్రలా ప్రకాష్ రాజ్ నిజజీవితంలో మారిపోయాడంటున్నారు ఆయన గురించి తెలిసినవాళ్లు. హేతువాదులను చంపేసిన సమయంలో బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. ఇప్పుడు అతని మాటల దాడి ఏకం గా ప్రధాని నరెంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై పెట్టడం సంచలనంగా మారింది.
prakash raj subramanya swamy కోసం చిత్ర ఫలితం
పద్మావతి మూవీని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధించడంపై నాడు ప్రకాష్ రాజ్ మండిపడ్డాడు. సినిమాలను నిషేధిస్తే ఒరిగేదేమీ లేదని, అలాగని తాను హిందువు లకు వ్యతిరేకం కాదన్నాడు. అసలు మోదీ, అమిత్‌ షా, అనంతకుమార్ హెగ్డేలు హిందువులే కాదని చెప్పడం వివాదాల అగ్గిని రాజేసింది. ఎవరు హిందువో? అసలు బీజేపీ గుర్తించలేకపోతోందని చెప్పాడు. 


హిందువులు ఉదారంగా వ్యవహరిస్తారని గుర్తుచేశాడు. కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ అద్భుత నటుడు తనదైన శైలిలో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు అదే బాటపట్టాడు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ, పెట్రోల్ ధరల పెంపు వంటి అంశాల విషయంలో బీజేపీ తీరును ఎండగట్టారు. అంతే కాదు.. సినీ పరిశ్రమ కు రాయితీలు ఇవ్వక పోవడం పట్ల గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు కేంద్రానికి కొరకరాని కొయ్యగా మారాడు. తెలంగాణ సి.ఎం కేసీఆర్ తో మంతనాలు జరిపిన తర్వాత ప్రకాష్ రాజ్, మోడీ, అమిత్ షాల పై విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది.
prakash raj subramanian swamy కోసం చిత్ర ఫలితం
దాదాపు ఇదే పద్దతిని ఒక ఏడాది నుంచి నరెంద్ర మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలతో చెలరేగిపోతున్నాడు. తన స్నేహితురాలైన జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులే కారణమని ఆరోపించిన ఆయన, ఈ విషయంలో మోడీ స్పందించక పోవడాన్ని కూడా తప్పుబట్టారు. ఆ తర్వాత పైన చెప్పిన అంశా ల వారీగా మోడీ సర్కారును లక్ష్యం చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పలు చర్చాకార్యక్రమాల్లో పాల్గొని మోడీని, భారతీయ జనతా పార్టీని ఉతికారేస్తూ వస్తున్నారు. చాలా చర్చా కార్యక్రమాల్లో ప్రకాష్ రాజ్ పై చేయి అవుతూ వస్తుంది.  
prakash raj subramanian swamy కోసం చిత్ర ఫలితం
"జస్ట్ ఆస్కింగ్" అంటూ నరేంద్ర మోడీ పై ప్రత్యక్ష దాడి మొదలుపెట్టిన ప్రకాష్ రాజ్ ఎంత అడ్డంగా బుక్కైపోయాడో తెలుసుకోవటానికి ఇది చదవండి. ఇంత కాలం నేను సామాన్యుడిని, నేను కేవలం ప్రజల తరపున మోడీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నా, అంటూ దాడి మొదలు పెట్టిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు చిక్కుల్లో పడి పడ్డాడు. 
త్వరలోనే తను రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నానని చెప్పకనే చెపుతున్న ఈ మహా నటుడు అందుకు తగ్గట్టు గానే మోడీనీ 'సాఫ్ట్ టార్గెట్' గా చేసుకొని చేస్తున్న మాటల దాడులు గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. 


ప్రతీ సమస్యకు "జస్ట్ ఆస్కింగ్" అంటూ ప్రకాష్ రాజ్ చేస్తున్న మాటల దాడులు కూడా తీవ్రం గానే ఉన్నాయని చెప్పాలి. తను మొడీని అమిత్ సాని మాత్రమే వ్యతిరేఖి స్తున్న ఈ పెద్ద మనిషి హిందువులను హిందూ విధానాలను వ్యతిరెఖించరట. అయితే ఈయన మాటలు పరిశీలిస్తే ఈ అక్షరాలా హిందూ వ్యతిరేఖి అని చెప్పొచ్చు. ఈ వామపక్ష ఉదారవాది లక్షణాలున్న ఈ మొనార్క్ ఇప్పుడు కాంగ్రెస్ ను కర్నాటకలో బలపరుస్తున్నాడు. అయితే దానికి తగ్గట్టుగానే నెటిజన్లు కూడా అతనికి సరైన కౌంటర్లే ఇస్తున్నారు. నేను యుద్ధం చేస్తోంది హిందూమతంతో కాదు , మోడీతో అని పలుమార్లు తెలివిగా సమాధానం ఇచ్చిన ప్రకాష్ రాజ్ ఈ మధ్యనే చేసిన ఒక ట్వీట్ తో దొరికిపోయాడు.
prakash raj subramanian swamy కోసం చిత్ర ఫలితం

వివరాల్లోకి వెళ్తే , కర్ణాటకలో ప్రముఖ కాంగ్రెస్ ఎంఎల్ఏ కొడుకు అయిన 'మొహమ్మద్ హారిస్ నలాపాడ్' ఈ మధ్యనే ఒక అసహాయ వికలాంగుని పై భౌతిక దాడి చేసాడు. అక్కడితో సరిపెట్టు కోకుండా అతని తలపై మందు సీసా పెట్టి బలంగా కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడిని హాస్పిటల్ లో చేర్చగా , అతను ప్రస్తుతం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంతటి గూండా గిరి చేసిన అతనిని గతం లో ది గ్రేట్ మోనార్క్ ప్రకాష్ రాజ్ పొగుడుతూ మెచ్చుకున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. 


ఒక వికలాంగుడిని అదీ అసాహాయుణ్ణి అంత దారుణంగా కొట్టి , హత్యా ప్రయత్నం చేసిన ఆ కాంగ్రెస్ లీడర్ కొడుకుని ప్రకాష్ రాజ్ ఒక స్థాయిలో ఈ వీడియోలో పొగడటం కనిపించింది. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్, నలాపాడ్ని అతని తండ్రిని, నలాపాడ్ని ఇంత గొప్పగా ఆ తండ్రి తీర్చి దిద్దిన తీరు గురించి వేదికపైకి పిలిచి మరీ సత్కరించి  అభినందించడం ఉంది.
prakash raj subramanian swamy కోసం చిత్ర ఫలితం
రెండు నాలుకల ధోరణి ప్రదర్శించే ఈ ప్రఙ్జా శాలి ఆ నలాపాడ్ ను ఇలా ఎందుకు చేశావు ఏమిటి అని ప్రశ్నించలేదు. బీజేపీ వారు దాడి చేస్తే మాత్రమే ప్రశ్నినించే నీ ద్వంద్వ స్వభావం కాంగ్రెస్ వారు ఒప్పుకోగలరేమోగాని, ఇతరులు కాని, హిందువులు కాని క్షమించరు. ముస్లిములు కాంగ్రెస్ వారు తప్పు చేసినప్పుడేమో వారిని సన్మానిస్తావా? అంటూ నెటిజన్లు ప్రకాష్ రాజ్ మీద బాగానే విరుచుకుపడుతున్నారు. అందుకే నీతులు చెప్పటం ముదిరితే మొదటికే మోసం వస్తుందనీవి మనకు రివర్సై బూమరాంగ్ అవుతుందని ప్రకాష్ రాజ్ తెలుసుకునే రోజు వస్తుంది. 


కానీ తాజాగా నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో మాత్రం ప్రకాష్ రాజ్‌కు గట్టి ధారుణమైన పంచ్‌లే పడ్డాయి. ఎంతటి వాళ్లనైనా తన వాగ్ధాటి తో ఆత్మరక్షణలో పడేయగల అజేయుడు భాజపా సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి, ప్రకాష్ రాజ్‌ను ఒక ఆటాడుకున్నారు.

prakash raj subramanya swamy కోసం చిత్ర ఫలితం
ఇండియాను 'హిందూదేశం' గా మార్చాలని మీరు ప్రయత్నిస్తున్నారా? మరి వివిధ ముస్లిం దేశాలు మన హిందువుల్ని వెళ్లగొడితే పరిస్థితి ఏంటి? అని ప్రకాష్ రాజ్ తానొక తెలివైన ప్రశ్న లేవనెత్తానని అనికొన్నాడు. దీనికి సుబ్రమణ్యస్వామి సమాధానం ఘాటు నషాళానికి అంటింది. అసలు ఇండియా నుంచి ముస్లింలు, ఇతర మతాల వాళ్లు వెళ్లిపోవాలని ఎవరంటున్నారు? అని ప్రశ్నించారు. హిందువులకే ఇక్కడ సరైన రక్షణ లేదని, వాళ్లు సంఘటితం కావాలని, వాళ్లపై వివక్ష పోవాలని మాత్రమే తాము అంటున్నామని అన్నారు. 
prakash raj subramanian swamy కోసం చిత్ర ఫలితం
అసలు ఇండియాలో ముస్లింలు ఇతర మతాల వాళ్లు ఉన్నంత సౌకర్యవంతంగా పాకిస్థాన్‌ లో లేదా ఒక గల్ఫ్ దేశంలో లేదా ఇతర అన్నీ ముస్లిం దేశాల్లో హిందువులు ఉన్నారా? అని దృఢంగా ప్రశ్నించారు. ఈ దేశాల్లో ఒక హిందూ గుడి కట్టే అవకాశముందా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ముస్లిం లు భారత దేశాన్ని పాలించినపుడు 47వేల ప్రధాన దేవాలయాల్ని కూల్చివేసి ధ్వంసం రచనతో వాటి ఆనవాళ్ళు లేకుండా చేయడం గురించి మీలాంటి "సూడో సెక్యులరిస్టులు" ఏనాడైనా ప్రశ్నించారా? అలా ఎప్పుడూ? ఎందుకు? ప్రశ్నించరని సుబ్రమణ్యస్వామి నిలదీశారు. దీంతో ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పలేక తడబడ్డాడు. 
సంబంధిత చిత్రం
సుబ్రమణ్యస్వామి ప్రకాష్‌ రాజ్‌ ను ప్రశ్నాపరంపరతో గాలి తీస్తున్న ప్రతి సారీ ఆడిటోరియం కరతాళ ద్వనులతో హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: