వివాదాస్పద నటి శ్రీరెడ్డి కాస్టింగ్-కౌచ్ తదితర విషయాలపై సమరశఖం పూరించినట్లే ఉంది. ఇక తనతో ఎలాంటి సెటిల్మెంట్లకు తావులేదని తగ్గేది లేదని నేఱగాళ్ళకు ఇక చెప్పుదెబ్బలే నని అన్నారు. అలాగే చిత్రపరిశ్రమను శాసించే ఆ ఐదు కుటుంబాలకి పై కఠినమైన నిర్ణయంతో ముందుకు నడుస్తానని అంతవరకు నిద్రపోనని శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 


*కాస్టింగ్ కౌచ్, 
*24 క్రాఫ్ట్స్‌లోని సమస్యలు, 
*తెలుగువారికి అవకాశాలు ఇవ్వకుండా బయటి రాష్ట్రాల వారికి అవకాశాలు ఇవ్వడం, 
*సినిమా పరిశ్రమలో పాతుకు పోయిన ఐదు కుటుంబాలు నియంతల్లా వ్యవహరిస్తున్న తీరు కు "చెక్ పెట్టటం" తన జీవితాశయమన్నారు.
sri reddy che guevera కోసం చిత్ర ఫలితం
పై విషయాలపై ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి.  దీన్ని మరింత ఉధృతం చేస్తోంది. తాజాగా ఐదు కుటుంబాలకు వార్నింగ్ ఇస్తూ తన ఫేస్ బుక్ పేజీలో బహిరంగ లేఖ సంధించింది. ఈ సందర్భంగా చెప్పుదెబ్బలు రెడీగా ఉండండి అంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. 
sri reddy che guevera కోసం చిత్ర ఫలితం
ఆమె తన లేఖలో పేర్కొన్న విషయాలను బట్టి ఆ 5 కుటుంబాల వల్ల నష్టపోయిన వారందరినీ శ్రీరెడ్డి ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది చెప్పు దెబ్బల కు రెడీ గా ఉండండి పెత్తందారులైన 5కుటుంబాల నియంత వ్యవహార శైలిపై మా యుద్ధం ఊపందుకుంది. 
sri reddy che guevera కోసం చిత్ర ఫలితం
బ్యాక్ టు బ్యాక్ మీటింగులతో ఎంతోమందిని కలిసి ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుంటున్నాం. విప్లవాగ్నితో రగిలిపోతున్నాం. మీ మీద విజయంకోసం తహతహ లాడుతున్నాం. మీ బడా ఫ్యామిలీస్‌ ను ఐఖ్యతతో ఎదుర్కొంటాం. మీ పైత్యాన్ని జనాల ముందు ఎండగడతాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. చెప్పు దెబ్బల కోసం ఎదురు చూడండి అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. 
sri reddy che guevera కోసం చిత్ర ఫలితం
షూటింగ్స్ ఎలా చేస్తారో చూస్తాం. లోకల్‌ గా ఉన్న తెలుగు సినీ కళాకారులకు శ్రామికులకు తిండి పెట్టకుండా బయట రాష్ట్రాల వారికి పరమాన్నం ఎలా పెడతారో చూస్తాం. మీ బ్లాక్ మనీ ఎక్కడ దాస్తున్నారో?  ప్రభుత్వం నోరు?  మీడియా నోరు మీరు ఎలా నొక్కాలని ప్రయత్నిస్తున్నారో?  ప్రపంచానికి చాటుతాం. మీ కంటి తుడుపు చర్యలకు సంతోషపడటానికి మేము  సిద్ధంగా లేము. మీ కొడుకులు, మీ మనుమలు మా అందరి రాజ్యాన్ని ఎలా ఏలుతున్నారో? ఎలా అందరి డబ్బు కొల్లగొడుతున్నారో? అందరికీ తెలిసేలా చేస్తామన్నారు.
srireddy beautiful images కోసం చిత్ర ఫలితం
సెటిల్మెంట్లకు లొంగను ఊపిరి తీద్దామని మీరు ఎన్ని బెదిరింపులు, సెటిల్మెంట్లు, ఎన్ని ప్లాన్స్ చేసి కాల్ చేసినా నేను వినను. 85 సంవత్సరాల ఈ సినీ కళామతల్లికి మీ దాస్య శృంకలాల చెర విడిపించి స్వాతంత్రం వచ్చేవరకు పోరాడతాం. ఇండిపెండెన్స్ ఇప్పించడంలో మేము అందరం ప్రాణాలకు తెగించి పోరాడతాం. ఈ ఉద్యమంలో ఈ సంఘానికి సంబంధించిన నేతలైన శ్రీరెడ్డి పేరు తో చేసే వసూళ్లకు మేము బాధ్యులము కాదు. ఇవ్వకూడదని నా మనవి, బ్లాక్ మెయిల్ చేసినచో మా దృష్టికి తీసుకు రావాలని శ్రీరెడ్డి తెలిపారు. 
suresh babu, allu aravind, dil raju, nagarjuna, balakrishna కోసం చిత్ర ఫలితం
మిమ్మల్ని కోర్టు బోనులు ఎక్కిస్తాం ప్రపంచ విప్లవ వీరుడు "చెగోవీరా" మా ఆదర్శం. మార్పు వీలైనంత తొందరగా తీసుకురాకపోతే, నా చెప్పు దెబ్బలకు రెడీ అవ్వండి. మీ పిచ్చి కుక్కలు స్వైర విహారానికి ఆపటానికి, కుక్కలను బందించటానికి బోనులు తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోర్టు బోనులు ఎక్కిస్తాం. మీరు, మీ కొడుకులు నల్ల డబ్బుతో చేసే అకృత్యాలకు చరమగీతం పాడుతాం. 
suresh babu, allu aravind, dil raju, nagarjuna, balakrishna కోసం చిత్ర ఫలితం
స్టూడియోల మీద ఎంత సంపాదిస్తున్నారో? డిస్ట్రిబ్యూషన్ మీద మీ పెత్తనాలు, యూఎఫ్ఓ, క్యూబ్ పేరు తో రక్తం పీల్చే జలగల్లాగా చిన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, చిన్న హీరో నుండి ఆర్టిస్టుల పాలిట దరిద్రం లా ఎలా దాపురించారో? అందరికీ తెలియజెబుతాం. 
suresh babu, allu aravind, dil raju, nagarjuna, balakrishna కోసం చిత్ర ఫలితం
మమ్మల్ని తొక్కేయ లేరు ప్రతి ఒక్కడు  "మంచి వాడు ముసుగు వేసుకుని - స్వామి మాలలు వేసుకుని" మంచి వాళ్ల లాగా చలామణి ఎలా అవుతున్నారో? ముసుగు తీసి నిజ స్వరూప దర్శనం చేయిస్తాం. మా ఉద్యమ విశ్వరూపం చూపిస్తాం.  ప్రతి పైసా ఎం చేస్తున్నారో? ఏం సేవా కార్యక్రమాలు ఎక్కడ చేశారో? చూపాలి అని “మా” తో సహా అన్నీ సినీ సంఘాలకు సమాఖ్యలకు సవాల్ చేస్తున్నాం. విప్లవ కారుల "ఐకాన్-చెగోవీరా" మా ఆదర్శమూర్తి, మా ఉద్యమాన్ని తొక్కేయడం మీ వల్ల కాని పని, అని శ్రీరెడ్డి తేల్చి చెప్పారు.

srireddy beautiful images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: