కాంగ్రెసు పార్టీ రాజకీయాలు మహా మహా మహులకే అర్ధం కావటం కష్టం. అయితే తెలంగాణా తెలుగుదేశం పార్టీ నుండి గోడ దూకిన శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోకి చేరిన కొత్తలో ఉండే తిమ్మిరి వదిలినట్లుంది అసలు కాంగ్రెస్ స్వరూపం అప్పుడే అనుభవంలోకి వస్తున్నట్లుంది. ఆయనకు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ లో ఉండే సెగ తగులుతోంది. కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి పార్టీలో తనకు లభించే ఉన్నత స్థానంపై చాలా చాలా ఆశలతో ఊహించుకున్నట్లే ఉన్నారు.

 revanth reddy ponguleti sudhakar reddy కోసం చిత్ర ఫలితం

అయితే, రేవంత్ రెడ్డి తనకు తగిన ప్రాధాన్యం పార్టీలో లభించడం లేదనే తలంపుతో ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. దాంతో కాంగ్రెసు పార్టీలో ఆయనకు సహచరుల నుండి సెగ మొదలైందని తెలుస్తుంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పు పట్టారనే కంటే ఒక్ విధమైన హెచ్చరికే చేసినట్లుంది. 

 

టీమ్ లీడర్ (ఉత్తమ్ కుమర్ రెడ్డి) తనను పట్టించు కోవడం లేదని, ఆయనకు సరైన సలహాదారులు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చాలా హామీలు ఇచ్చారని ఇంత కాలం భావిస్తూ వచ్చారు. కానీ ఆయనకు రాహుల్ గాంధీ ఏ విధమైన హామీ ఇవ్వలేదని సుధాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 ponguleti sudhakar reddy, uttam kumar reddy, revant reddy కోసం చిత్ర ఫలితం

రేవంత్ రెడ్డి ఇటీవలే తమ పార్టీలో చేరారని ఆయన చాలా జూనియర్ అన్న భావన ద్వనించేలా వ్యాఖ్యానించారని అంటున్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో లభించే ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశంపార్టీ పట్ల అసంతృప్తితో కాంగ్రెసులో చేరిన ఆయనకు ఇక్కడ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం లభించే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని, ఇంకా క్రిందికి కుంగే పరిస్థితులే ఉన్నాయని అభిఙ్జవర్గాల కథనం. 

 revanth reddy ponguleti sudhakar reddy కోసం చిత్ర ఫలితం

ఎవరు కూడా షరతులు పెట్టి పార్టీలో చేరలేదని, సహనం వహించాలని, నాయకుల కన్నా పార్టీ ముఖ్యమని సుధాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేవనేత్తిన అంశాలపై పార్టీ కోర్ కమిటీ చర్చిస్తుందని కూడా ఆయన చెప్పారు.

 revanth reddy ponguleti sudhakar reddy కోసం చిత్ర ఫలితం

తెలంగాణరాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సమైక్యాంధ్ర కోసం పోరాడిన చంద్రబాబు నాయుడు వెంట రేవంత్ రెడ్డి నడిచారని సుధాకర్ రెడ్డి ఎత్తిపొడిచిన భావం కనిపించిం దంటున్నారు.  దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో ప్రత్యేక స్థానం ఏదీ ఉండదని మనం అర్థం చేసుకోవచ్చు. చివరికి అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు కాంగ్రెసు పార్టీకి కాకుండా రేవంత్ రెడ్డి రెంటికి చెడిన రేవడి రెడ్డి అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: