ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి.  ఇప్పటికే వైసీపీ వర్సెస్ టీడీపీ మద్య మాట యుద్దం కొనసాగుతుంది. అప్పట్లో ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి వరుసగా వలసలు కొనసాగాయి..దాంతో ఏపీలో వైసీపీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.  ఇక పార్టీ ప్రతిష్టను పెంచేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంసిద్దులయ్యారు. గతంలో తన తండ్రి చేసిన పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని ఏపీలో అన్ని జిల్లాలు పర్యటించేందుకు సిద్దమయ్యారు. 

‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టినప్పటి నుంచి జగన్ కి అన్ని వైపుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. అంతే కాదు ఈ మద్య ఏపికి ప్రత్యే హోదా విషయంలో టీడీపీ చేసిన మోసం ప్రజలు గమనిస్తున్నారు.  దాంతో కొంత మంది రాజకీయ నాయకులు సైతం వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు..ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు జగన్..ఈ నేపథ్యంలో ఆయకు మరింత బలం చేకుంది.  ఈ మద్య టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ అవుతున్నారు కొంత మంది టీడీపీ ముఖ్యనేతలు.

ఈ క్రమంలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, పారిశ్రామికవేత్త వసంత కృష్ణ ప్రసాద్‌ గురువారం వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో వసంత కృష్ణప్రసాద్‌ సహా వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరికీ జగన్‌ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తామని వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్‌ ఈ సందర్భంగా చెప్పారు. 
Image result for YSRCP
ఉదయం ఆరు గంటలకు ఐతవరం నుంచి ర్యాలీ మొదలవుతుంది. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లనున్నారు. పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే..కృష్ణప్రసాద్ ను వైసీపీలోకి వెళ్లనీయకుండా మంత్రి దేవినేని ఉమా, విజయవాడ టీడీపీ అధ్యక్షుడు బుద్ధ  వెంకన్నలు తీవ్ర  ప్రయత్నాలు చేశారు కానీ అవి బెడిసికొట్టాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: