టిడిపి కర్ణాటక ఎన్నికల్లో బిజెపి పట్ల వ్యవహరించిన తీరు ప్రశ్నార్ధకంగా మారింది. చంద్రబాబు తీరును బిజెపి వాదులు తీవ్ర ఆక్షేపణీయంగా భావిస్తున్నారు. నాలుగేళ్ళ స్నెహంలో బిజెపి పై ఒక్క ఆరోపణ చేయకుండా మెచ్చుకోళ్ళు ప్రదర్శించిన టిడిపి ఒక్కసారిగా అదీ అకస్మాత్తుగా రాజకీయ ప్రయోజనాలకోసం యూ-టర్న్ తీసుకొని "ప్రత్యేక పాకేజి కోసం అర్రులు చాచి, ఆపై మనసా వాచా కర్మణా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసిపి ఉద్యమాన్ని హైజాక్ చేయటానికి ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డ టిడిపి" తన నైతికతను నిభద్దతను కోల్పోయిన దరిమిలా కొద్ది రోజుల్లో రాష్ట్రంలో సమూల రాజకీయ మార్పులు చోటుచేసు కుంటాయని బిజెపి నేతలు చెపుతున్నారు. 
gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితం
అంతే కాదు టిడిపి మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కర్ణాటకలో బిజెపికి వ్యతిరెకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేసి తన అసలైన అస్థిత్వాన్నే తెలుగుదేశం అధినేత స్వార్ధం కోసం ఫణంగా పెట్టినట్టు ప్రజలు భావిస్తున్నారు. కేంద్రం నుండి రాష్ట్ర ప్రయోజనాలను ఆశించేవారు చేయకూడని పని ఇదని అంటున్నారు.    

gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితంఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో టీడీపీ విష ప్రచారం చేసిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఎపి రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయని, ఆ మార్పులు తేవడానికి తమకు 3 నుంచి 6 నెలల సమయం చాలు నని ఆయన అన్నారు. అందుకు తగిన ప్రణాళిక తమ వద్ద ఉందని చెప్పారు. 

gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు ప్రభుత్వాన్ని "కాగ్" తప్పుపట్టిందని, ఎపి లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు చెప్పిందని, కాగ్ కు కేంద్రంతో గానీ ఏ పార్టీతో గానీ సంబంధం లేదని అన్నారు. అసెంబ్లీని టీడీపి ప్రచార వేదికగా మార్చారని అన్నారు. అక్రమాలు జరిగినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని అన్నారు. 2004లో ఎదుర్కున్న పరిస్థితినే టీడీపి 2019 ఎన్నికల్లో చవి చూస్తుందని అన్నారు. తాను ఏ పార్టీకి ఓటు వేయాలని చెప్పలేదని, ఎపికి అన్యాయం చేసిన పార్టీని ఓడించాలని మాత్రమే చెప్పానని చంద్ర బాబు అంటూనే తన నిర్ణయాన్ని వెల్లడించారని ఆయన అన్నారు. 

gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితం

తమపై చంద్రబాబు ఏకపక్షంగా దుర్మార్గమైన దాడి చేశారని, ప్రజలే నిలదీసే విధంగా చంద్రబాబు ప్రజా కోర్టులో నిలబెడుతామని అన్నారు. పరిపాలనలో పూర్తిగా విఫలం చెందిన చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా భారీస్థాయిలో అవినీతికి పాల్పడిందని, ఏపీలో కొన్నిరోజుల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటా యని, గత నాలుగేళ్లుగా భారీస్థాయిలో అవినీతికి పాల్పడిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.

gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు చెబుతున్నట్టు ఇప్పటిదాకా చేసుకున్న బోగస్ ప్రచారం సరిపోక మరింతగా పెంచాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపు నిస్తున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను చంద్రబాబు తన పేరుతో ప్రచారం చేసుకోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితం

ముఖ్యమంత్రి ఇటీవల విజయవాడలో నిర్వహించిన దీక్షకు రూ.32కోట్లు ఖర్చు చేసినట్టు అధికార లెక్కలు చెబుతుంటే, నిజ నిర్థారణ చేస్తే దాని మొత్తం రూ.100కోట్లకు పైగానే ఉంటుందని పేర్గొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో దీక్షలు చేయడమే కాకుండా అందులోనూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నిక ల్లో టీడీపీకి ఇబ్బందులు తప్పవు అన్నట్లు పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.

gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితం

కర్నాటక  ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఎన్నికలు పూర్తయిన అనంతరం బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో అవినీతి అవకతవకలపై టీడీపీని పార్లమెంట్ వేదికగా నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సరైన యుసీలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని జీవీఎల్ పేర్కొన్నారు.

 gvl narasimha rao about TDP Government and chandrababu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: