తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం ఈ ఉదయం వచ్చి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రత్యేక హోదా సెగ తగిలింది.కర్నాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను ఒడించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శ్రీవారిని దర్శించుకోవడానికి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు రాత్రి 8.40 గంటలకు చేరుకోగానే తిరుమల జేఈవో కె.ఎస్‌ శ్రీనివాసరాజు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు. అతిథిగృహంలో ఆయనకు టిటిడి అధికారులు ప్రత్యేక బస ఏర్పాట్లను చేశారు. 
alipiri 11052018 1
ప్రజలతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఆయన రాకను నిరసిస్తూ నినాదాలు చేశారు. అమిత్ షా వస్తున్నారన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న తిరుపతి వాసులు, అలిపిరి వద్దకు చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఏపికి కేంద్రం చేసిన అన్యాయానికి ఇక్కడ సామాన్యులు పైతం కేంద్రంపై గుర్రుగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చిన  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  మీడియాను కూడా దరిదాపుల్లోకి పంపలేదు. ఆయన వెంట స్థానిక బిజెపి నేతలు భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్‌ ఉన్నారు.   
Image result for amish shah bjp
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ నిరసన చేపట్టగా, కాలినడకన తిరుమలకు బయలుదేరిన పలువురు యాత్రికులు కూడా వారితో జతకలిశారు. నిరసనను ముందుగానే పసిగట్టిన పోలీసులు, భారీ ఎత్తున అలిపిరిలో మోహరించి నిరసనకారులను అడ్డుకున్నారు.అమిత్ షాకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, ప్రొటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: