తెలుగు చిత్రపరిశ్రమలో పవర్ స్టార్  పవన్ కళ్యాన్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు పవన్ కళ్యాన్.  మొదటి నుంచి సామాజిక సేవపై ఎక్కువ దృష్టి పెడుతూ వస్తున్న పవన్ కళ్యాన్ ప్రజాసేవలో ప్రత్యేక్షంగా పాల్గొనేందుకు ‘జనసేన’పార్టీ స్థాపించారు.  గతంలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి తక్కువ కాలంలోనే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.  అయితే పవన్ స్థాపించిన పార్టీ పై కూడా ఎన్నో రూమర్లు వచ్చాయి..కానీ పవన్ కళ్యాన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఇప్పుడు ఏపి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు.
Image result for tdp
ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పటిష్టతను పెంచేందుకు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.  ఇప్పటికే  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు పర్యాయాలు పర్యటన చేశారు.  ఈ సందర్భంగా  ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే..మరోవైపు టీడీపీని విమర్శస్తూ..తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.  మొన్నటి వరకు కేంద్రంతో దోస్తీ చేస్తూ వచ్చిన టీడీపీ ఎన్నికల సందర్భంగా బీజేపీతో వైరం పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, పవన్ కళ్యాన్ చేస్తున్న ప్రత్యేక పోరాటానికి ప్రజల మద్దతు బాగానే లభిస్తుంది.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ఉన్నారు.
Image result for ysrcp
హైదరాబాద్ నుంచి రేణిగుంట వెళ్లిన పవన్... అక్కడి నుంచి అలిపిరికి చేరుకున్నారు. అనంతరం తిరుమల కొండపైకి కాలి నడకనన వెళ్లగా... దారి పొడవునా పవర స్టార్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. నేడు ఆయన శ్రీవారిని దర్శించుకోవడానికి కొండపైకి కాలి నడకనన వెళ్లగా... దారి పొడవునా పవర స్టార్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జనసేనాని తిరుమలకు రావడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వెంకన్నను దర్శించుకున్న తర్వాత తన బస్సు యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Related image
టూర్ షెడ్యూ‌ల్‌తో పాటూ... ఎజెండాను తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే హైవే రోడ్డు విస్తరణ నిర్వాసితులతో భేటీ అవుతారట.  ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసిన విషయం తెలిసిందే. జనసేన బలోపేతంపై దృష్టిపెట్టిన పవన్ కళ్యాణ్... ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో యాత్ర చేపట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రూట్ మ్యాప్‌ను కూడా ప్రకటిస్తామన్నారు. హోదా అంశంతో పాటు వివిధ రకాల ప్రజా సమస్యలపై పవన్ జనంలోకి వెళ్లబోతున్నారట. బస్సు యాత్ర పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలను కూడా నియమించినట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: