ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కర్ణాటకలో గాలి జనార్ధన్ పేరు బాగా మోగేది. మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి కోట్లకు పడగెత్తడంలో రాజశేఖర్ రెడ్డి ప్రమేయం ఎంతో ఉందని అప్పట్లో చెప్పేవారు. అంతే కాదు మైనింగ్ కేసులో సీబీఐ విచారణలో గాలి ముద్దగాయి తేలడంతో జైలు జీవితం కూడా అనుభవించారు.
Image result for karnataka elections 2018 jds
తాజాగా కర్ణాటకలో నేడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి..ఈ నేపథ్యంలో  బళ్లారి సిటీ అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన గాలి సోమశేఖర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండగా మరో తమ్ముడు గాలి కరుణాకర్ రెడ్డి కూడా హరపణహళ్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో దిగి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మైనింగ్ డాన్‌గా పేరొందిన గాలి జనార్ధన్‌రెడ్డి తన సామ్రాజ్యాన్ని పదిలంగానే ఉంచుకున్నాడనిపిస్తోంది.
Image result for gali janardhan
ఇదే విషయం ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు ద్వారా స్పష్టమవుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేకపోయినప్పటికీ తన తమ్ముళ్లు, అనుచరులను ఎన్నికల బరిలోకి దించారు. అనంతరం తెరవెనుక నుంచి మొత్తం నడిపించినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన అనుచరుడు ఫకీరప్ప కూడా ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇక... తన ప్రధాన అనుచరుడు, సోదరుల్లో ఒకరిగా ఉన్న శ్రీరాములు కూడా ఆధిక్యంలో కొనసాగుతుండడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: