కర్ణాటకలో సీఎం సీటు కోసం కాంగ్రెస్ - జేడీఎస్ వర్సెస్ బీజేపీ మద్య రగడ మొదలైంది. మొదట బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నా..తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి పోవడంతో ఇబ్బందుల్లో పడింది. అయితే కర్ణాటకలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలమీద ఉన్న బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి వంద కోట్లు ఇస్తామంటున్నారని.. మంత్రి పదవి ఆశ చూపిస్తున్నారని బీజేపీపై జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. 

Image result for karnataka elections

ఎమ్మెల్యేల కొనుగోళ్లను రాష్ట్రపతి, గవర్నర్, మోదీ ప్రోత్సహిస్తారా? లేక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని చెప్పిన బీజేపీ ఇప్పుడు రాజకీయ తంత్రం ప్రయోగిస్తుందని..కుయుక్తులు పన్నుతున్నారని కుమార స్వామి అరోపించారు.  జేడీఎస్ శాసనసభాపక్షనేతగా కుమారస్వామిగౌడ ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

Image result for karnataka parties

అనంతరం, కుమారస్వామిగౌడ మీడియాతో మాట్లాడుతూ, శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.  ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, సెక్యులర్ ఓట్లు చీలడం వల్లే బీజేపీకి 104 సీట్లలో విజయం లభించిందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో తాము చేతులు కలిపామని చెప్పారు. ఈ సందర్భంగా జేడీఎస్ నుంచి రేవణ్ణ వర్గం చీలుతుందన్న వార్తలను కొట్టిపారేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: