బీజేపీ రాంమాధవ్‌ ఇంట విషాదంజాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి రాంమాధవ్‌ ఇంట విషాదం నెలకొంది.  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన తల్లి జానకీ దేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాదులో జరగనున్నాయి.

ఈ సందర్భంగా రామ్ మాధవ్ కు పలువురు బిజెపి నేతలు సంతాపం తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో హంగ్ ఏర్పడటంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠత ఏర్పడింది.  ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధం అవుతుండగా..మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ ఏకమయ్యారు.  ఈ నేపథ్యంలో గవర్నర్ వద్ద ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు వర్గాలు అర్జీ పెట్టుకున్నారు. 

కాగా,  కర్ణాటకలో హంగ్ ఏర్పడటంతో రాంమాధవ్ అక్కడ కాంగ్రెస్, జేడిఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ లోనికి తెచ్చే పనిలో ఉండగా ఈ వార్త తెలిసింది. ఇటువంటి వ్యవహారాలలో రాంమాధవ్ దిట్ట.  గతంలో త్రిపుర, అస్సాం, నాగాల్యాండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆయన పార్టీకి మద్దతుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయించారు.  ఇదే సమయంలో  ఆయనకు మాతృ వియోగం కలగడం బాధాకరమని కొందరు బీజేపీ నేతలు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: