ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) విడుదలయ్యాయి.  98శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. . రాష్ట్రవ్యాప్తంగా 35,024 మంది దరఖాస్తు చేసుకోగా 33,637 మంది హాజరయ్యారని మంత్రి వివరించారు. వీరిలో 33,038 మంది అర్హత సాధించారని తెలిపారు. విద్యార్థినులు 98.74 శాతం (6,730), విద్యార్థులు 98.28 శాతం (26,344) , ట్రాన్‌జెండర్స్‌ 14 (93.33%) అర్హత సాధించారన్నారని చెప్పారు.

ఏయూ పరిధిలో 98.38 శాతం, ఎస్వీయూ పరిధిలో 98.30 శాతం, ఓయూ పరిధిలో 98.93 శాతం స్థానికేతరులు 95.70 శాతం హాజరయ్యారన్నారు. . ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో 98.87 శాతంతో ఆనంతపురం జిల్లా ప్రథమ స్ధానంలో నిలవగా, 97.94 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 21 యూనివర్సిటీల పరిధిలో 948 సీట్లు, 421 ప్రైవేట్‌ కళాశాలల పరిధిలో 84,329 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ జిఎస్‌ పాండాదాస్‌, ఈసెట్‌ కన్వీనర్‌ పిఆర్‌ భానుమూర్తి, ఎమ్మెల్సీ ఎఎస్‌ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు అందుకున్న తొమ్మది మంది ఉపాధ్యాయులకు టివిఎస్‌ కంపెనీ అందించిన స్కూటర్లను మంత్రి గంటా శ్రీనివాసరావు అందజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: